Libya Floods: లిబియా వరద బీభత్సం, డ్యాం తెగడంతో కొట్టుకుపోయిన 40 వేలమంది ప్రాణాలు
డెర్నా, ఇతర నగరాల్లో సహాయక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. శిధిలాల తొలగింపు కొనసాగుతోంది.
వేలాదిమంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మృతుల సంఖ్య పెరుగుతోంది. విదేశాల్నించి లిబియా సహాయం అర్ధిస్తోంది.
మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ వినాశనంలో దాదాపు 40 వేలమంది చనిపోయారు. చాలా మృతదేహాలు సముద్రంలో కొట్టుకుపోయాయి.
డెర్నా సృష్టించిన వినాశనం చూసేందుకు చాలా భయంకరంగా ఉంది. పెద్ద పెద్ద భవంతులు నేలకూలాయి. నగరంలో 25 శాతం మాయమైపోయింది.
డెర్నా నగరంలో లక్షమంది వరకూ ఉంటారు. ఒక డ్యామ్ తెగిన తరువాత చాలావరకూ నగరం దెబ్బతిన్నది.
ఈ డ్యాంలు కూడా అంత పెద్దవేం కాదు. ఒక డ్యాం 70 మీటర్ల ఎత్తు. మొదటి డ్యాం తెగిన తరువాత రెండవ డ్యాం తెగేందుకు పెద్ద సమయం పట్టలేదు
డెర్నాకు ఎగువన రెండు ప్రముఖ డ్యాంలు ఉన్నాయి. ఇందులో ఒక డ్యాం 2002 నుంచి మెయింటెనెన్స్‌కు నోచుకోలేదు.
డేనియల్ తుపాను కారణంగా లిబియా తూర్పు ప్రాంతంలో భారీ వరద పోటెత్తింది. డ్యాం తెగడం పరిస్థితిని అత్యంత భయంకరంగా మార్చింది.
Libya Floods: లిబియాలో డేనియల్ తుపాను భారీ విధ్వంసం రేపింది. డెర్నా డ్యామ్ ఒక్కసారిగా తెగడంతో 40 వేలమంది వరకూ మరణించినట్టు అంచనా.