Ancient Predators: డైనోసార్ల కంటే ముందు భూమ్మీద మనుగడ సాగించిన భయంకర జంతువులివే
టంకలియోస్టియస్
ఇది కూడా అతి పెద్ద జంతువు. భారీ కవచం కలిగిన చేప ఇది. దాదాపుగా 360 మిలియన్ ఏళ్ల క్రితం ఉండేది. దీని పొడవు 33 అడుగులుండేది. అత్యంత భయంకరంగా ఉండేది
టెరీగోటస్
దాదాపుగా 430-360 మిలియన్ ఏళ్ల క్రితం భూమిపై టెరీగోటస్ అనే భారీ సముద్ర తేలు ఉండేది. ఇది ఇప్పటి వరకు ఉన్న అతి పెద్ద ఆర్దోపోడస్ జీవాల్లో ఒకటి. దీని పొడవు 8 అడుగులు. ఇది అప్పటి సముద్రాల్లో ఉండేది. షార్క్, తిమింగసలం కంటే ముందుండేది.
గోర్గోనోప్సిడస్
దాదాపు 260 మిలియన్ ఏళ్లక్రితం గోర్గోనోప్సిడస్ అనే భయంకరమైన జంతువుండేది. ఈ జంతువు పొడవు 10 అడుగులుండేది. పదునైన దంతాలు, బలమైన దవడలుండేవి
డిమెట్రోడాన్
దాదాపుగా 295-272 మిలియన్ ఏళ్ల క్రితం డిమోట్రోడాన్ అనే జంతువుండేది. ఇది చూసేందుకు డైనోసార్‌లానే ఉండేది. డైనోసార్ల కంటే ముందు ఉండేవి. పదునైన దంతాలు, దవడలతో అత్యంత భయంకరంగా ఉండేది. 15 అడుగులు పొడుగు ఉండేది.
ఎనోమాలోకోరిస్
దాదాపుగా 520 మిలియన్ ఏళ్ల క్రితం క్యాంబ్రియన్ కాలంలో ఎనోమాలోకారిస్ అనే జంతువుండేది. ఈ జంతువు పొడుగు 3 అడుగులుండేది. అప్పట్లో ఇది చాలా పెద్దది. నీట్లో ఉండి ఎవరినైనా టార్గెట్ చేసేది