Death Prohibited Here: ఈ ఐదు పట్టణాల్లో మరణం నిషేధం, శ్మశానం లేని ఊర్లు ఇవే

Thu, 01 Aug 2024-6:13 pm,

Cugnaux France

ఇది ఫ్రాన్స్ దేశంలోని ఓ నగరం. ఇక్కడ కూడా మరణం నిషేధం. ఎవరైనా మరణిస్తే ఖననం చేయడానికి వీల్లేదు. వేరే ప్రాంతానికి తీసుకెళ్లాల్సిందే. 

Longyearbyen-Norway

నార్వేలోని స్వాల్ బోర్డ్ ద్వీపంలోని ప్రముఖ నగరమిది. ఇక్కడ నో డెత్ పాలసీ అమల్లో ఉంది. ఇదేదో మారమూల ప్రాంతమని కాదు. ఇక్కడి అతి శీతల ఉష్ణోగ్రత ఇందుకు కారణం. ఇక్కడెప్పుడూ మైనస్ టెంపరేచర్ ఉంటుంది. దాంతో మృతదేహాలు ఎప్పటికీ డీ కంపోజ్ కావు. అందుే 1950 తరువాత ఈ నగరంలో శ్మశానం క్లోజ్ అయింది. మరణం నిషేధమైంది.

Itsukushima Japan

ఈ ప్రాంతం శింతో మతానికి పవిత్రమైంది. 1868 వరకు ఇక్కడ జనన మరణాలకు అనుమతి లేదు. ఇప్పటికీ ఈ పట్టణంలో ఎలాంటి ఆసుపత్రి గానీ, శ్మశానం గానీ లేదు. 

Selia, Italy

ఇటలీకు చెందిన ఈ హిల్ స్టేషన్. ఈ పట్టణ పరిధిలో ఎవరూ వ్యాధిగ్రస్తులు కాకూడదు. ఈ పట్టణంలో జనాభా తగ్గుతుండటంతో నియంత్రించేందుకు మరణంపై నిషేధం విధించారు. ఆరోగ్యం గురించి సరైన శ్రద్ధ తీసుకోలేక అనారోగ్యానికి గురైతే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 

Le lavandou France

ఫ్రాన్స్ దేశంలోని ఈ పట్టణంలో 2000 సంవత్సరంలో మరణంపై నిషేధం విధించారు. పర్యావరణ నిబంధనల కారణంగా కొత్త శ్మశానం అనుమతి లేకపోవడంతో ఈ ఆదేసాలు జారీ అయ్యాయి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link