YS Jagan YS Sharmila Assets Dispute: తెలుగు రాజకీయాల్లో వైఎస్సార్ కుటుంబం ఆస్తుల గొడవ పెను సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అన్నాచెల్లెళ్ల మధ్య ఆస్తుల వివాదం తీవ్రస్థాయికి చేరుకుంది. సోదరితోపాటు తల్లిని కోర్టుకు ఈడ్చడంతో రాజకీయంగా ఈ వివాదం పెను దుమారం రేపుతోంది. ప్రస్తుతం మాజీ సీఎం వైఎస్ జగన్, కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య లేఖాస్త్రాలు నడుస్తున్నాయి. బహిరంగంగా.. లేఖల రూపంలో తన సోదరుడి వైఖరిని షర్మిల తప్పుబడుతున్నారు. కోర్టులో విచారణ జరిగితే ఈ వివాదం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. కాగా వీరి కుటుంబ గొడవలను ప్రత్యర్థి పార్టీలు రాజకీయంగా వాడుకోవడం ఈ వివాదాన్ని మరింత ముదిరేటట్టు చేసింది. అయితే రాజకీయ వివాదం పక్కనపెడితే అసలు షర్మిల, జగన్ మధ్య ఏం ఆస్తులు గొడవలు ఉన్నాయి? వారిద్దరికీ ఎవరు ఆస్తులు పంచి పెట్టారు? అనేది ఆసక్తికరంగా మారింది. వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు పేర్ని నాని చెప్పిన వివరాలతోపాటు మరికొంత విశ్వసనీయ సమాచారం ప్రకారం జగన్, షర్మిల ఆస్తుల మధ్య ఆస్తుల లెక్కలు ఇవే!
Also Read: Jagan Vs Sharmila: జగన్ గుట్టు రట్టు..3 పేజీల బహిరంగ లేఖ వదిలిన షర్మిలారెడ్డి..!
గొడవ ఇక్కడే
వైఎస్సార్ బతికి ఉన్న సమయంలోనే వైఎస్ షర్మిలకు ప్రత్యేకంగా ఆస్తులు పంచి పెట్టారు. వాటిలో బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 2లోని 280 గజాల స్థలం, ఇడుపులపాయలో 51 ఎకరాల స్థలం, 15 మెగావాట్ల సండూరు హైడ్రో పవర్ ప్రాజెక్ట్, స్మాల్ హైడ్రో ప్రాజెక్ట్ లైసెన్సులు. ఇంకా 22.5 మెగావాట్ల స్వాతి హైడ్రో పవర్ ప్రాజెక్టులో వాటాలు. విజయవాడలోని రాజ్ యువరాజ్ థియేటర్‌లో 35 శాతం వాటా, పులివెందులలో 7.6 ఎకరాల భూమి, విజయలక్ష్మి మినరల్స్ ట్రేడింగ్ కంపెనీలో వంద శాతం వాటాలు షర్మిలకు ఉన్నాయి. అంతేకాకుండా జగన్ ప్రారంభించిన వ్యాపారాల్లో చెల్లి షర్మిలకు ఆస్తుల్లో వాటా ఉంది. భారతి సిమెంట్స్‌లో 40 శాతం, మీడియా సంస్థలో 40 శాతం వాటాలు కూడా ఉన్నాయని సమాచారం.
Also Read: YS Sharmila: నా అన్న వైఎస్ జగన్ చేసింది మహా పాపం: వైఎస్ షర్మిల
జగన్ ఆస్తులు
భారతి సిమెంట్స్, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్, మీడియా (సాక్షి) వ్యాపార సంస్థలన్నీ జగన్‌కు చెందుతాయి. క్లాసిక్ రియాలిటీ, యలహంక ప్రాపర్టీ వంటివి కూడా జగన్ వద్ద ఉన్నాయని తెలుస్తోంది. బెంగళూరు, హైదరాబాద్‌తోపాటు కడప, పులివెందుల, ఇడుపులపాయ తదితర ప్రాంతాల్లో జగన్‌కు స్థిరచరాస్తులు ఉన్నాయి.
ఉమ్మడిగా ఆస్తులు
వైఎస్సార్ తాను బతికున్న సమయంలోనే ఆస్తి పంపకాలపై ఒక స్పష్టత ఇచ్చారని సమాచారం. జగన్‌కు ఇద్దరు కూతుళ్లు, షర్మిల ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. వారిని వైఎస్సార్ అల్లారుముద్దుగా చూసుకునేవారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే వైఎస్సార్ తన మనవళ్లు, మనవరాళ్లకు ఆస్తులు రాసి ఇచ్చారని తెలుస్తోంది. జగన్, షర్మిల పిల్లలకు సమానంగా ఆస్తులు ఇచ్చారంట. ప్రస్తుతం ఇక్కడే పేచీ మొదలైంది. నాడు మాటపూర్వకంగా చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి జగన్ ఇప్పుడు కోర్టును ఆశ్రయించడంతోనే వివాదం మొదలైందని తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.