Motorola G04 Price Down: ఫ్లిఫ్‌కార్ట్‌లో పవర్ ఫుల్ Motorola G04 మొబైల్ కేవలం రూ.5,999కే..
ఫ్లిఫ్‌కార్ట్‌లో గతంలో మోటరోలా కంపెనీ లాంచ్ చేసిన కొన్ని సిరీస్ మొబైల్ పై ప్రత్యేకమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా కొనుగోలు చేసే వారికి డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటోరోలా గతంలో విడుదల చేసిన మోటోరోలా జి04 (Motorola G04) ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్స్ తో పాటు ఫ్లాట్ డిస్కౌంట్‌తో ఫ్లిఫ్‌కార్ట్ అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌ను మోటోరోలా మార్కెట్లో MRP ధర రూ.9,999తో విక్రయించింది.
ఫ్లిఫ్‌కార్ట్ అందిస్తున్న ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా ఈ మొబైల్ కొనుగోలు చేసే వారికి 30 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.6,999కే పొందవచ్చు.
అంతేకాకుండా ఈ మోటోరోలా జి04 (Motorola G04) మొబైల్ పై అదనంగా ఫ్లిఫ్‌కార్ట్ బ్యాంక్ ఆఫర్స్‌ను కూడా అందజేస్తుంది ఈ ఆఫర్స్‌లో భాగంగా మీరు ఏదైనా బ్యాంకు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డుతో బిల్ చెల్లిస్తే రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది.
దీంతోపాటు మరింత అదనపు తగ్గింపు పొందడానికి ఫ్లిఫ్‌కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు ను వినియోగించి కొనుగోలు చేస్తే ఐదు శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ ఫోను ఈ మోటోరోలా జి04 మొబైల్ కేవలం రూ.5,999కే పొందవచ్చు.
ఇక ఈ మోటోరోలా జి04 (Motorola G04) స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఇది 4జి నెట్వర్క్‌తో మాత్రమే లభిస్తోంది. దీంతోపాటు ఇది డ్యూయల్ సిమ్ ఆప్షన్తో అందుబాటులోకి వచ్చింది. అలాగే అతి శక్తివంతమైన 5000Mah బ్యాటరీతో అందుబాటులో ఉంది.
ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికొస్తే, ఈ మోటోరోలా జి04 (Motorola G04) మొబైల్ బ్యాక్ సెట్‌లో కేవలం సింగిల్ కెమెరా సెట్ అప్‌ను కలిగి ఉంటుంది. ఇది 16 మెగాపిక్సల్ కెమెరా, ఎల్ఈడి ఫ్లాష్ లైట్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా కూడా లభిస్తుంది.