Mouni Roy: మరోసారి హాట్ ఫోటో షూట్ తో రెచ్చిపోయిన మౌనీరాయ్..నాగిని భామ లేటస్ట్ పిక్స్ అదరహో..

Fri, 18 Oct 2024-5:55 am,

మౌనీ రాయ్ తన చిత్రాల కంటే ముందు సీరియల్స్ తో పాపులర్ అయింది. ముఖ్యంగా  హిందీలో వచ్చిన పలు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గర అయింది. అంతేకాదు స్మాల్ స్క్రీన్ పై వచ్చిన పాపులారిటీతో బిగ్ స్క్రీన్ పై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

మౌనీరాయ్.. 2006లో 'క్యూ కీ సాస్ బీ కభీ బహు తీ' సీరియల్‌తో యాక్ట్రెస్ గా స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెరకెక్కిన 'నాగిని' సీరియల్‌తో ఓవర్ నైట్ పాపులారిటీ సంపాదించుకుంది.

 

నాగిని సీరియల్‌తో వచ్చిన పాపులారిటీతో సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. ఫస్ట్ టైమ్ ఈమె పంజాబీ మూవీ 'హీరో హిట్లర్ ఇన్ లవ్' అనే చిత్రంతో కథానాయికగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది.

ముందుగా పంజాబీ సినిమాల్లో నటించిన మౌనీ రాయ్.. ఆ తర్వాత హిందీ సినిమాల్లో తన లక్ ను పరీక్షించుకుంది. 2018లో అక్షయ్ కుమార్ నటించిన 'గోల్డ్' చిత్రంతో హిందీ చిత్రసీమలో ఎంట్రీ ఇచ్చింది. 

హిందీలో  ‘తుమ్ బిన్ 2’, సౌత్ లో ‘కేజీఎఫ్’ సినిమాలో ఐటెం సాంగ్‌లో యాక్ట్ చేసి  నార్త్ టూ సౌత్ అన్ని ఇండస్ట్రీస్ జనాల చూపును  తనపైపు తిప్పుకునేలా చేసింది. అంతేకాదు అప్పట్లోనే టీవీ నటిగా హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి చేరుకుంది మౌనీ రాయ్.

ఇక  నాగార్జున, అమితాబ్, రణబీర్ కపూర్, షారుఖ్‌ ఖాన్‌ హీరోలుగా నటించిన 'బ్రహ్మాస్త్ర'లో జునూన్ అనే విలన్‌ పాత్ర మౌని రాయ్‌కు నటనకు మంచి సేరు తీసుకొచ్చింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link