Mouni Roy: సాంప్రదాయ చీరకట్టులో మౌనీరాయ్ అందాలు అదరహో.. లేటస్ట్ పిక్స్ వైరల్..
మౌనీ రాయ్ సినిమాల కంటే ముందు సీరియల్స్ తో పాపులర్ అయింది. ముఖ్యంగా హిందీలో తెరకెక్కిన పలు సీరియల్స్ ద్వారా ఆడియన్స్ కు చేరువ అయింది. అంతేకాదు స్మాల్ స్క్రీన్ పై వచ్చిన పాపులారిటీతో బిగ్ స్క్రీన్ పై తన లక్ ను పరీక్షించుకుంది.
మౌనీరాయ్.. 2006లో 'క్యూ కీ సాస్ బీ కభీ బహు తీ' సీరియల్‌తో యాక్ట్రెస్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెరకెక్కిన 'నాగిని' సీరియల్‌తో ఓవర్ నైట్ పాపులర్ అయింది.
నాగిని సీరియల్‌తో వచ్చిన పాపులారిటీతో సినిమాల్లో అవకాశాలు కొట్టేసింది. ఫస్ట్ టైమ్ ఈమె పంజాబీ మూవీ 'హీరో హిట్లర్ ఇన్ లవ్' అనే మూవీతో హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది.
ముందుగా పంజాబీ సినిమాల్లో నటించిన మౌనీ రాయ్.. ఆ తర్వాత హిందీ చిత్రాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 2018లో అక్షయ్ కుమార్ నటించిన 'గోల్డ్' మూవీతో హిందీ చిత్రసీమలో ఎంట్రీ ఇచ్చింది.
హిందీలో ‘తుమ్ బిన్ 2’, సౌత్ లో ‘కేజీఎఫ్’ సినిమాలో ఐటెం సాంగ్‌లో యాక్ట్ చేసి నార్త్ టూ సౌత్ అన్ని ఇండస్ట్రీస్ జనాలను తనపైపు చూసేలా చేసింది. అంతేకాదు అప్పట్లోనే టీవీ నటిగా హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి చేరుకుంది మౌనీ రాయ్.
ఇక నాగార్జున, అమితాబ్, రణబీర్ కపూర్, షారుఖ్ ఖాన్ హీరోలుగా నటించిన 'బ్రహ్మాస్త్ర'లో జునూన్ అనే విలన్ పాత్ర మౌని రాయ్‌కు మంచి పేరు తీసుకొచ్చింది.