Mrunal Thakur: స్టైలిష్ లుక్స్ తో అలరించిన మృణాల్.. హీట్ పెంచుతున్న హీరోయిన్

Sun, 30 Jun 2024-7:59 am,

హిందీ భాషలో సీరియల్స్ ద్వారా నటన ప్రారంభించిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఆ తర్వాత హిందీలో పలు సినిమాలలో నటించింది. హృతిక్ రోషన్తో చేసిన సూపర్ 30 సినిమా మృణాలకి మంచి పేరు తెచ్చిపెట్టింది. కాగా సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ హీరోయిన్. 

దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపుడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం సీతారామం. ఈ సినిమాలో సీతా పాత్రలో కనిపించి అందరి మదిని సొంతం చేసుకునింది మృణాల్ ఠాకూర్. ఈ సినిమా మంచి విషయం సాధించడమే కాకుండా ఈ హీరోయిన్ కి ఎన్నో అవకాశాలు తెచ్చిపెట్టింది. 

ఆ తరువాత నాని హీరోగా వచ్చిన హాయ్ నాన్న సినిమాలో కనిపించింది. ఈ సినిమాలో యష్ణా పాత్రలో కనిపించి మరోసారి ప్రేక్షకుల మదిని దోచుకుంది ఈ హీరోయిన్. ఈ సినిమా కూడా కమర్షియల్ గా మంచి విజయం అందుకుంది. అలానే మృణాల్ కి కూడా మంచి పేరు తెచ్చి పెట్టింది. 

ఇక తన మూడో సినిమాగా వచ్చిన ఫ్యామిలీ స్టార్ మాత్రం మృణాల్ కి పెద్ద షాక్ మిగిల్చింది. పరశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా ఈ హీరోయిన్ కి తెలుగులో మొదటి పరాజయాన్ని పరిచయం చేసింది. 

ఇక ఈ మధ్యనే ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ఈ చిత్రంలో మృణాల్ కేవలం 10 నిమిషాలు మాత్రమే కనిపించడం గమనర్హం. చిరంజీవి విశ్వంబరా సినిమాలో కూడా ఈ హీరోయిన్ ఉన్నట్టు వినికిడి. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరిని ఆకర్షిస్తున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link