Naga Chaitanya wedding invitation::ఎట్టకేలకు నాగచైతన్య-శోభిత పెళ్లి డేట్ ఫిక్స్.. పెళ్లి కార్డు వైరల్!
సమంత - నాగచైతన్య ప్రేమించుకుని వివాహం చేసుకున్నప్పటికీ కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడిపోయారు. సమంత - నాగచైతన్య ఇద్దరు కూడా ఎవరి పనులలో వారు బిజీగా ఉన్నప్పటికీ నాగచైతన్య హీరోయిన్ శోభితతో గత కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తూ ఉన్నారు..
మొదట ఈ విషయాన్ని అందరూ కొట్టి పారేసినా.. కానీ సడన్గా ఎంగేజ్మెంట్ చేసుకొని ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. ఇటీవలే చాలా సింపుల్ గా బంధువులు, కుటుంబం, స్నేహితుల సమక్షంలోనే జరిగింది.
అయితే వివాహం తేదీ గురించి పలు రకాల వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి. అయితే తాజాగా ఇప్పుడు ఈ జంటకు సంబంధించి పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
అందరూ అనుకున్నట్టుగానే డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం జరగబోతోంది అంటూ పెళ్లి కార్డును అక్కినేని ఫ్యామిలీ షేర్ చేశారు.మొత్తానికైతే ఇప్పటివరకు వస్తున్న వార్తలకు చెక్ పడింది అని చెప్పవచ్చు.
ఇకపోతే అన్నపూర్ణ స్టూడియోలోనే వీరి వివాహానికి భారీ సెట్ ఏర్పాటు చేసి అక్కడ వివాహం జరిపించబోతున్నట్లు తెలుస్తోంది.మొత్తానికి అయితే అక్కినేని ఇంట కొత్త కోడలుగా శోభిత అడుగుపెట్టబోతోంది అని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.