Samantha: సమంత తండ్రి మృతి.. స్పందించని నాగచైతన్య..!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత తాజాగా పితృవియోగం పొందింది. గుండెపోటు రావడంతో నిద్రలోనే ఆయన తుది శ్వాస విడిచినట్లు సమాచారం . ఇకపోతే తన తండ్రి జోసెఫ్ ప్రభు మరణాన్ని సమంత తన సోషల్ మీడియా ఖాతా ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఇక నేను మిమ్మల్ని కలవలేను నాన్న అంటూ హార్ట్ బ్రేక్ అయిన ఏమోజిని పంచుకుంది.
సమంత ఒకప్పుడు హీరోయిన్ గా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో, తన తల్లిదండ్రులు ఎంతగానో తనకు సహాయపడ్డారట. ముఖ్యంగా తన తండ్రి ఈమెకు ప్రతి విషయంలో వెంటే ఉన్నట్లు సమంత ఎన్నో సార్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ దీనికి తోడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా సరే తల్లిదండ్రుల కోసం కచ్చితంగా ఆమె సమయాన్ని కేటాయిస్తూ ఉండేది.
సమంత సినిమా షూటింగ్ ల నిమిత్తం హైదరాబాద్, ముంబై అంటూ తిరుగుతున్నప్పటికీ చెన్నైలో నివసించే తన తల్లిదండ్రులను కలవడానికి ఎప్పుడు వెళుతూ ఉండేదట. ఇక తన తల్లిదండ్రులకి తన జీవితంలో ఎంతో ప్రాముఖ్యత ఇచ్చింది సమంత.ఇకపోతే తన జీవితంలో అన్నీ తానై, తనను ముందుకు నడిపిస్తున్న తన తండ్రి మరణించడంతో సమంత తీవ్ర మనస్థాపానికి గురవుతోంది. ఇక సమంతా తండ్రి మరణంతో పలువురు సినీ సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు. కష్ట సమయంలో ఆమెకు అండగా నిలుస్తున్నారు.
ఇకపోతే సినీ ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద స్టార్ సెలబ్రిటీలు స్పందిస్తున్నప్పటికీ సమంత మాజీ భర్త నాగచైతన్య కానీ, అక్కినేని కుటుంబం కాని స్పందించకపోవడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పాలి. ప్రస్తుతం అక్కినేని ఇంట పెళ్లి వేడుకలు ఘనంగా జరగబోతున్నాయి. ఇలాంటి వేళ సమంత తండ్రి మరణించడంతో ఒకరు కూడా స్పందించకపోవడం ఆశ్చర్యకరమని చెప్పాలి.
ఇకపోతే బాలీవుడ్లో మలైక అరోరా తండ్రి మరణించినప్పుడు ఆమె మాజీ భర్త అర్బాజ్ ఖాన్ తోపాటు ఆమె మాజీ లవర్ అర్జున్ కపూర్ కూడా ఆమెకు అండగా నిలిచారు. ఆమె నుంచి విడిపోయిన సరే కష్ట సమయంలో ఆమెకు తోడుగా ఉన్నారు.. కానీ ఇక్కడ నాగచైతన్య కుటుంబం స్పందించకపోవడంతో కనీసం మానవతావాదం కూడా లేదా అంటూ సమంత ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం
సమంత నుంచి విడిపోయారు కానీ ఆమె తల్లిదండ్రుల నుంచి కాదు కదా.. ఆమె తండ్రి చనిపోయినప్పుడు కనీసం పరామర్శించాల్సిన అవసరం కూడా మీకు లేదా.. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటూ నాగచైతన్య అలాగే ఆయన ఫ్యామిలీ పై అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. మరి దీనిపై చైతూ కుటుంబం ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.