Naga Chaitanya: మాజీ భార్యను కలిస్తే నాగ చైతన్య ఏం చేస్తారో తెలుసా..?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మంచి పేరు సొంతం చేసుకున్న జంటలలో నాగచైతన్య- సమంత జంట కూడా ఒకటి . అయితే అనూహ్యంగా వీరిద్దరూ విడిపోయి అందరిని ఆశ్చర్యపరిచారు.
ఇకపోతే ఈ మధ్యకాలంలో వీరిద్దరూ వృత్తిపరమైన విషయాలతోనే కాకుండా వ్యక్తిగత విషయంపై కూడా తరచుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఒకప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట ఇప్పుడు మాజీ జంట అనిపించుకుంటుంది. ఇకపోతే వీరిద్దరూ విడిపోయినా వీరి గురించి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది.
అందులో భాగంగానే నాగచైతన్య తన మాజీ భార్య సమంతను కలిస్తే ఏం చేస్తాడు అనే విషయంపై ఆయన మాట్లాడినప్పుడు ఇది కాస్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గతంలో అమీర్ ఖాన్.. నటించిన లాల్ సింగ్ చద్దా అనే సినిమాలో నటించారు నాగ చైతన్య. ఈ సినిమా ప్రమోషన్ సమయంలో రాపిడ్ ఫైర్ నిర్వహించగా.. మీరు సడన్గా మీ మాజీ భార్యను కలిస్తే ఏం చేస్తారు అని ప్రశ్నించారు. దీనికి నాగ చైతన్య హాయ్ చెప్పి కౌగిలించుకుంటాను అని తెలిపారు. దీంతో అభిమానులందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే ఇప్పటికీ తన భార్య జ్ఞాపకార్థంగా తన చేతి మణికట్టుపై పచ్చబొట్టును అలాగే ఉంచుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించినప్పుడు ఆయన తొలగించాల్సిన అవసరం లేదు అంటూ సున్నితంగా చెప్పి, సమంత పై ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు.
మరొకవైపు సమంత కూడా తన నడుము పై చైతన్య పేరును అలాగే వుంచుకుంది. దానిని ఇంకా ఆమె తొలగించలేదు. అయితే విడాకుల తర్వాత ఇంస్టాగ్రామ్ లో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్లో చిన్న వయసులోనే టాటూలు వేయించుకోవద్దని సలహా ఇస్తానని మాత్రమే సమంత చెప్పింది.
ఇకపోతే 2017 లో వివాహం చేసుకున్న వీరు 2021లో విడిపోయారు. ఇక సమంత వరుస సినిమాల పైన దృష్టి పెట్టగా.. నాగచైతన్య శోభిత ధూళిపాళ్లతో త్వరలో ఏడడుగులు వేయబోతున్నారు.