Sobhita Chaitu Wedding: మరికొన్ని గంటల్లో శోభితతో పెళ్లి.. సమంత మీద ఇంకా ఫీలింగ్స్ పోలేదా..?.. చైతుపై నెట్టింట దుమారం..
ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా నాగచైతన్య శోభిత పెళ్లి గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. తమ అక్కినేని ఇంట పెళ్లి వేడుకను చూసేందుకు అభిమానులు కళ్లలో ఓత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారంట.
శోభిత ధూళిపాళ చైతు రేపు అంటే.. డిసెంబర్ 4న పెళ్లి బంధంతో ఒక్కటవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్న పూర్ణ స్టూడియోను గ్రాండ్ గా ముస్తాబు చేసినట్లు తెలుస్తొంది. అయితే.. వీరిద్దరి పెళ్లి రాత్రి పూట 8 తర్వాత జరుగనున్నట్లు తెలుస్తొంది.
బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం... దాదాపు 8 గంటల క్రతువు ఉండనున్నట్లు తెలుస్తొంది. అయితే.. శోభిత, చైతుల మంగళస్నానాలు ఇటీవల గ్రాండ్ గా అన్న పూర్ణ స్టూడియోస్ లో జరిగింది.
శోభిత పెళ్లి కూతురులా రెడ్ కలర్ సారీలో, ఆభరణాలు ధరించి అచ్చం పుత్తడిబొమ్మలా మెరిసిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇరు కుటుంబాలు అక్కినేని ఫ్యామిలీ సైతం..వీరి పెళ్లికి ఎంతో ఉత్సహంతో ఎదురుచూస్తున్నాయంట.
ఈ నేపథ్యంలో చైతు మరోసారి కాంట్రవర్సీలో ఇరుక్కున్నట్లు తెలుస్తొంది. చైతు, సమంతా డైవర్స్ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. వీరిద్దరు..కలిసి గతంలో. 2019లో రిలీజ్ అయిన 'మజిలీ' సినిమా ప్రమోషనల్ పోస్టర్ లో వీరిద్దరూ కలిసి కన్పించారు. ఆ ఫోటోను.. ఇంకా చైతు తన ఇన్ స్టాలో డిలీట్ చేయకుండా అలానే ఉంచేశాడంట.
దీనిపై ప్రస్తుతం వివాదం రాజుకున్నట్లు తెలుస్తొంది. నెటిజన్లు మాత్రం చైతు తీరును తప్పుపడుతున్నారంట. ఇంకా ఆ పోస్ట్ అవసరామా అని అంటున్నారంట. ఒక వేళ అది శోభిత కంట పడితే.. మరల ఇద్దరి మధ్యలో గ్యాప్ స్టార్ట్ అయ్యేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారంట. దీంతో ఈ నెట్టింట ఈ ఘటన కాస్త వార్తలలో నిలిచింది.