Nagarjuna Top Movies: నాగార్జున కెరీర్ లో రాడ్ రంబోలా డిజాస్టర్ సినిమాలు ఇవే..

Thu, 29 Aug 2024-2:40 am,

నాగార్జున రీసెంట్  డిజాస్టర్స్

నాగార్జున రీసెంట్ గా నటించిన ‘ది ఘోస్ట్’, శిరిడి సాయి, ఆఫీసర్, మన్మథుడు 2,  కేడీ వంటి చిత్రాలు బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచాయి.

ఆటో డ్రైవర్

భాష డైరెక్టర్ సురేశ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన చిత్రం ‘ఆటో డ్రైవర్’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.

రక్షకుడు..

నాగార్జున హీరోగా కేటీ కుంజుమోన్ నిర్మాణంలో ప్రవీణ్ గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైన బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. 

వజ్రం..

ఎస్పీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో భారీ అంచనాలతో విడుదలైన చిత్రం ‘వజ్రం’.  ఈ సినిమా నాగ్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీస్ లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

అంతం..

ఆర్జీవి దర్శకత్వంలో నాగార్జున, ఊర్మిళ హీరో, హీరోయిన్లుగా  తెరకెక్కిన చిత్రం ‘అంతం’. ఈ సినిమా కాన్సెప్ట్ బాగున్నా.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.

గోవిందా.. గోవింద..

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగార్జున, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా నటించిన ‘గోవిందా గోవింద’ చిత్రం కాన్సెప్ట్ బాగున్నా.. కాంట్రవర్సీ కారణంగా సరైన ఫలితాన్ని అందుకోలేదు.

కిల్లర్

అక్కినేని నాగార్జున మలయాళ దర్శకుడు ఫాజిల్ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘కిల్లర్’. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా వెంకీ ‘చంటి’ దూకుడు ముందు నిలబడలేకపోయిం

చైతన్య..

నాగార్జున .. తన తనయుడు ‘చైతన్య’ టైటిల్ తో ప్రతాప్ పోతన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

ఇద్దరూ.. ఇద్దరే..

నాగార్జున తన తండ్రి నాగేశ్వరరావుతో కలిసి నటించిన మరో చిత్రం ‘ఇద్దరూ ఇద్దరే’. ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణ పరాజయాన్ని అందుకుంది.

నేటి సిద్ధార్ధ..

క్రాంతి కుమార్ దర్శక, నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘నేటి సిద్ధార్ధ’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

అగ్ని పుత్రుడు.. కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో నాగార్జున నటించిన తొలి చిత్రం ‘అగ్నిపుత్రుడు’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

కెప్టెన్ నాగార్జున..

వి.బి.రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన చిత్రం ‘కెప్టెన్ నాగార్జున’. ఈ సినిమా నాగార్జున కెరీర్ లో తొలి డిజాస్టర్ మూవీగా రికార్డులకు ఎక్కింది. అటు అరణ్య కాండ చిత్రం కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link