Tollywood Actress: ట్రోలర్స్ దెబ్బకు నాగార్జున హీరోయిన్ ఇన్స్టా అకౌంట్ డిలీట్.. ప్లాస్టిక్ సర్జరీ అంటూ.!
ప్రముఖ టాలీవుడ్ బ్యూటీ ఆయేషా టాకియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈమె.. తొలి పరిచయంతోనే అందరిని ఆకట్టుకుంది.
తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని డిలీట్ చేశారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈమె.. ఇలా ఉన్నట్టుండి ఇలా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ను డిలీట్ చేయడానికి గల కారణం మాత్రం తెలియ రాలేదు. అయితే తాజాగా తన లుక్స్ పై వస్తున్న ట్రోల్స్ వల్లే ఈమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
దాదాపు 13 సంవత్సరాలకు పైగా వెండితెరకు దూరంగా ఉన్న ఈమె, ఇటీవలే అభిమానులకు సోషల్ మీడియా ద్వారా చేరువయ్యింది. ఫ్యాన్స్ తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు చెబుతూ పోస్ట్ పెడుతోంది. ఇదిలా ఉండగా ఇటీవల తన లేటెస్ట్ లుక్కుకి సంబంధించిన ఫోటో ని అభిమానులతో పంచుకున్నారు ఆయేషా టాకియా. అందులో నీలం రంగు చీర ధరించి చెంపలు పల్చబడి , పెదవులు వాచిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది ఆయేషా.
ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఒకప్పటి క్యూట్ బ్యూటీ ని మేము మిస్ అవుతున్నాము.. ఇదేం లుక్.. అసలు ఇలా ఎందుకు చేసుకున్నావ్.. నీకేమైంది.. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నావా అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. దీంతో ట్రోలర్స్ దెబ్బకు ఇబ్బంది పడిపోయిన ఆయేషా టాకియా ఇలా ఉన్నట్టుండి తన ఇంస్టాగ్రామ్ ఖాతాని కూడా డిలీట్ చేసింది. ఇక ప్రస్తుతం ఇన్స్టా లో ఈమె కనిపించలేదు.
ఆయేషా టాకియా సినిమాల విషయానికి వస్తే టార్జాన్ ది వండర్ కార్ అనే చిత్రంతో సినిమా ఇండస్ట్రీలో కి అడుగు పెట్టిన ఆయేషా.. బాలీవుడ్లో తెరకెక్కిన చాలా చిత్రాలలో గ్లామర్ రోల్స్ పోషించింది. 2011లో విడుదలైన మోడ్ తర్వాత మళ్లీ ఇండస్ట్రీకి దూరమైంది ఈ ముద్దుగుమ్మ.. ఏది ఏమైనా నాగార్జున సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఇలా ఉన్నట్టుండి గుర్తుపట్టలేనంతగా మారిపోయి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఇప్పుడు అభిమానుల ట్రోల్స్ తట్టుకోలేక అకౌంట్ ని కూడా క్లోజ్ చేసింది.