NBK Visit Venky movie Sets: వెంకటేష్ కు సడెన్ సర్ప్రైజ్ ఇచ్చిన నట సింహం బాలకృష్ణ..

Sat, 21 Sep 2024-12:22 pm,

NBK Visit Venky movie Sets: విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సెన్సేషనల్ కాంబినేషన్‌లో మూడో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పొల్లాచ్చిలో పెద్ద క్రూసియల్ షెడ్యూల్‌ను కంప్లీటైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని RFCలో   షూటింగ్ జరుగుతుంది. వెంకటేష్‌తో పాటు ప్రముఖులు నటీనటులు షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

తాజాగా ఈ సెట్స్‌ లోకి నందమూరి నట సింహం ప్రత్యేక అతిథి వచ్చి వెంకటేష్ తో పాటు మూవీ యూనిట్ కు సడెన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. పక్కనే బాలయ్య, బాబీకి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. అక్కడ షూటింగ్ లో కాస్త గ్యాప్ దొరకడంతో బాలయ్య.. వెంకీ, అనిల్ రావిపూడిల షూటింగ్ సెట్స్ లో సందడి చేశారు.

ఈ ఆన్-లొకేషన్ స్టిల్స్‌లో బాలకృష్ణ, వెంకటేష్, అనిల్ రావిపూడి మధ్య ఫ్రెండ్ షిప్ కు ఎలాంటిదో మరోసారి ప్రూవ్ అయింది. బాలయ్య రాకతో టీం చాలా థ్రిల్‌ ఫీల్ అయింది.బాలకృష్ణ, వెంకటేష్ మధ్య మంచి స్నేహం ఉంది. వీరిద్దరు వీలైనపుడల్లా పలు వేదికలపై కలుసుకుంటూనే ఉంటారు.

అనిల్ రావిపూడి NBK ఆల్-టైమ్ హిట్ భగవంత్ కేసరిని డైరెక్ట్ చేసి బాలయ్యను మంచి హిట్ అందించారు. రీసెంట్ గా ఈ మూవీ SIIMAలో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే కదా.

 

ఈ చిత్రంలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి ఎక్స్ లవర్ గా పాత్రలో నటిస్తోంది.  ఈ ట్రై యాంగిల్ క్రైమ్ డ్రామా ని దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్, తమ్మిరాజు ఎడిటర్. ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ కో -రైటర్స్. వి వెంకట్ యాక్షన్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రాన్ని వెంకీ అనిల్ 3ని 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. మరోవైపు బాలయ్య, వెంకటేష్ కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తే బాగుంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

వెంకటేష్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో  మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కాబ్రా, చిట్టి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link