Nara Rohit wife: నారా రోహిత్ కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్..!
ప్రముఖ హీరో నారా రోహిత్ ఆదివారం ప్రతినిధి -2 సినిమాలో హీరోయిన్ గా నటించిన శిరీషా లెల్ల తో నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు సమక్షంలో వీరి నిశ్చితార్థం చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నారా నందమూరి ఫ్యామిలీలతో పాటు నారా చంద్రబాబు నాయుడు ఆయన భార్య భువనేశ్వరి సతీ సమేతంగా హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ గురించి అందరూ వెతకడం మొదలుపెట్టారు. ఇక అమ్మాయి ఎవరో తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ప్రతినిధి 2 హీరోయిన్ శిరీషా స్వస్థలం రెంటచింతల.
వీరిది సామాన్య రైతు కుటుంబం. గురజాల మండలం దైదకు చెందిన నాగేశ్వరరావు 30 సంవత్సరాల క్రితమే గ్రామం విడిచి రెంటచింతలకు వలస వచ్చారట. వ్యవసాయం చేస్తూ కష్టపడి తమ నలుగురు కుమార్తెలను ఉన్నత చదువులు చదివించారు.
వారిలో ఒకరే శిరీష. ఈమె నాల్గవ అమ్మాయి. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లి అక్కడే విద్య పూర్తి చేసి కొంతకాలం ఉద్యోగం కూడా చేసింది. సినీ రంగంపై అభిమానంతో హైదరాబాదుకు వచ్చిన ఈమె.. సినిమాలలో నటించడానికి అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది.
అలా మొదటిసారి నారా రోహిత్ హీరోగా నటించిన ప్రతినిధి -2 సినిమాలో అవకాశం దక్కించుకుంది. మొదటి సినిమాతోనే ఆ హీరోతో పరిచయం ఏర్పడి, అది కాస్త ప్రేమగా మారి నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక హైదరాబాదులో వీరు నిశ్చితార్థం ఘనంగా జరిగింది.
అంతేకాదు డిసెంబర్ 15వ తేదీన వీరు వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక త్వరలోనే పెళ్లి వివాహ వేడుకకు సంబంధించిన అన్ని విషయాలు నారా కుటుంబం అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.