Nara Rohit: హీరోయిన్ తో ఏడడుగులు వేయనున్న నారా రోహిత్.. పెళ్లెప్పుడంటే..?
ఈనెల 13వ తేదీన హైదరాబాద్లో ఆయన నిశ్చితార్థం జరగనున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈయన నటించిన ప్రతినిధి -2 లో హీరోయిన్గా నటించిన సిరి లేళ్ల ను..రోహిత్ వివాహం చేసుకోబోతున్నట్లు వార్తల వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇకపోతే నారా రోహిత్ వివాహం చేసుకోబోతున్నారని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇదైనా నిజం కావాలని, ఆయన కొత్త జీవితంలోకి అడుగుపెట్టి కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టాలని ఆకాంక్షిస్తున్నారు.
నారా రోహిత్ ఎవరో కాదు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కుమారుడే. రోహిత్ చదివంతా కూడా హైదరాబాదులోనే పూర్తయింది చెన్నైలోని అన్నా యూనివర్సిటిలో ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీలో బీటెక్ పూర్తి చేసి, ఆ తర్వాత న్యూయార్క్ ఫిలిం అకాడమీ న్యూయార్క్ నుండి నటన అలాగే లాస్ ఏంజెల్స్లో ఫిలిం మేకింగ్ కోర్స్ కూడా పూర్తి చేశాడు.
2009లో విడుదలైన బాణం సినిమా ద్వారా..ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈ సినిమాకి దర్శకుడిగా పని చేసిన చైతన్య దంతులూరి కూడా ఆ సినిమాతోనే.. తొలిసారి డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక 2011లో పరుశురాం దర్శకత్వం వహించిన.. సోలో సినిమా నారా రోహిత్ కి మంచి గుర్తింపును అందించింది.. ఆ తర్వాత పలు విజయాలు అపజయాలు అందుకున్న ఈయన.. కొద్ది రోజులు ఇండస్ట్రీకి దూరమయ్యాడు.
ఆ తర్వాత రాజకీయాలలో కూడా కనిపించాడు. ఈ మధ్యనే ప్రతినిధి -2 సినిమా చేసి సక్సెస్ అందుకున్న రోహిత్.. సుందరకాండ సినిమాతో మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.