NASA CADRE Mission: నాసా నుంచి సూట్‌కేస్ సైజులో బుల్లి రోవర్, వచ్చే ఏడాది చంద్రునిపై
CADRE మిషన్ లాంచ్ ఎప్పుడు
మూడు CADRE రోవర్ల పరీక్ష పూర్తయిందని నాసా ఇప్పటికే ప్రకటించింది. త్వరలో నోవా సి ల్యాండర్‌తో ఇంటిగ్రేట్ చేయనుంది. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది చంద్రునిపై ప్రయోగించనుంది. ఈ రోవర్ చంద్రుని రీనర్ గామా ప్రాంతంలో అడుగెట్టనుంది.
అద్బుతమైన కో ఆర్డినేషన్
ఈ రోవర్లకు ఎలక్ట్రో మేగ్నెటిక్ ఇంటర్ ఫేస్ అండ్ కంపాటిబిలిటీ టెస్టింగ్ కూడా చేశారు. దీంతో రోవర్ యెక్క ఎలక్ట్రానిక్ సబ్ సిస్టమ్ ఒకదానికొకటి అడ్డంకిగా మారకుండా చేస్తుంది.
చంద్రుని ఉపరితలంపై 3డి మ్యాప్
చంద్రునిపై అడుగెట్టేందుకు సిద్ధమైన ఈ రోవర్‌లో పవర్ కోసం సోలార్ ప్యానెల్స్ అమర్చారు. కెమేరా, సెన్సార్లు, రాడార్ సహిత రోవర్‌తో చంద్రుని 3డి మ్యాప్ తీయనుంది. మార్స్ యార్డ్‌పై పరీక్ష తరువాత వైబ్రేషన్ అండ్ ధర్మల్ టెస్ట్ కూడా నిర్వహించారు.