Nature’s wonder: సూర్యుడు అస్తమించని ఆ ఐదు దేశాలివే..అక్కడ రాత్రి ఉండదు
ప్రపంచంలోని అందమైన దేశాల్లో ఒకటిగా నార్వే ప్రసిద్ధి. నార్వేను ల్యాండ్ ఆఫ్ ద మిడ్ నైట్ సన్ గా కూడా పిలుస్తారు. ఇక్కడ మే నుంచి జూలై వరకూ 24 గంటలూ సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. ఇక్కడ 76 రోజుల వరకూ సూర్యరశ్మి నిరంతరం ఉంటుంది. ఇక్కడ సాయంత్రం సమయంలో కాస్త చీకటి పడుతుందంతే.
యూరప్ లోని రెండవ అతి పెద్ద ద్వీపం ఐస్ ల్యాండ్. ఇక్కడ అర్ధరాత్రిలో కూడా సూర్యరశ్మి ప్రకాశిస్తూ ఉంటుంది.
అలాస్కా గ్లేసియర్ అత్యద్భుతంగా సుందరంగా ఉంటుంది. ఇక్కడ మే నుంచి జూలై వరకూ సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. ఇక్కడ రాత్రి 12 గంటల 30 నిమిషాలకు సూర్యుడు అస్తమించి..తిరిగి సరిగ్గా 51 నిమిషాల తరువాత ఉదయిస్తాడు. అంటే సూర్యుడు కేవలం 51 నిమిషాల సేపే కన్పించకుండా ఉంటాడు.
24 గంటల్లో 23 గంటల వరకూ సూర్యుడు ప్రకాశించే దేశం ఫిన్ ల్యాండ్. ఇక్కడ వేసవిలో 73 రోజుల వరకూ రాత్రి అనేదే ఉండదు. ఇక్కడి అందాల్ని చూడ్డానికి లక్షలాది పర్యాటకులు వస్తుంటారు.
కెనడాలో దాదాపు ఏడాదంతా మంచు పేరుకుపోయి ఉంటుంది. అయినా...వేసవి రోజుల్లో కూడా ఇక్కడ రాత్రి ఉండదు. సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు నిరంతరం