Navapanchama Rajayoga: శని సూర్యులు కలిసిన నవ పంచమ రాజయోగం.. ఈ రాశులకు జాక్‌పాట్ తగిలినట్టే..!
శనిదేవుని ప్రభావం 12 రాశులపై ఉంటుందని జ్యోతిష్యులు చెబుతారు. ఆయా గ్రహాలు, నక్షత్రాలు కలిసి కొన్ని రాశులకు అదృష్టాన్ని తీసుకువస్తే, మరికొన్ని రాశులకు కష్టకాలాన్ని తీసుకువస్తాడు.
అయితే, శని దయ ఉంటే ఏ పనిచేసినా అదృష్టం కలిసి వస్తుంది, ఎదురుండదు అని నమ్ముతారు. శని సాడేసతి వెళ్లిపోయే ముందు కూడా ఆయన మనుకు ఏదో ఒక మంచి చేసి పోతాడు అని నమ్ముతారు. అక్టోబర్ 17వ తేదీన సూర్యుడు తులా రాశిలోకి ప్రవేశించాడు. అప్పటికే సూర్యుడు అక్కడ ఉన్నాడు. ఈ రెండూ కలిసి నవపంచమ రాజయోగ ఏర్పరుస్తున్నాయి.
ఈ శని సూర్యుల కలయికతో 3 రాశులకు అదృష్టాన్ని తీసుకువస్తాయి. ఈ యోగం మరో నెలవరకు ఉంటుంది. దీనివల్ల భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్న రాశులు ఏవో తెలుసుకుందాం. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్ చేయండి..
మేషరాశి.. శని సూర్యుల కలయిక వల్ల మేష రాశివారికి భారీ ఆర్థిక ప్రయోజనాలు తీసుకువస్తుంది. పని ప్రదేశంలో ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో భారీ లాభాలను గడిస్తారు. కుటుంబంలో సఖ్యత కూడా పెరుగుతుంది. అంతేకాదు కెరీర్‌లో మంచి పురోగతికి బాటలు పడతాయి.
వృషభ రాశి.. నవపంచమ రాజయోగం వల్ల వృషభ రాశివారికి కూడా భారీ లాభాలను కలుగుతాయి. వీరికి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి శుభ సమయం. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
తులా రాశి.. నవపంచమ రాజయోగం వల్ల తులా రాశి వారికి కూడా భారీ ఆర్థిక లాభాలు కలుగుతాయి. వ్యాపారం విస్తరిస్తారు. పని ప్రదేశంలో ముఖమైన బాధ్యతలు తీసుకుంటారు. ఆర్థిక పురోగతికి కూడా బాటలు పడతాయి.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)