Cheetah in Miyapur Viral Video: కొంతమంది ఈ చిరుత దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా ఆ విజువల్స్ వైరల్ అవుతున్నాయి. మియాపూర్ మెట్రో స్టేషన్ వెనుక జరుగుతున్న నిర్మాణ పనులకు వచ్చిన కూలీలు చిరుతను చూసి వీడియో తీశారు. దీంతో పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకుని అటవీ శాఖ అధికారులకు కూడా సమాచారం అందించారు. ఇప్పుడు చిరుతను గాలించే పనిలో పడ్డారు. స్థానికులను కూడా అప్రమత్తం చేశారు. ఒంటరిగా ముఖ్యంగా రాత్రి సమయంలో బయట తిరుగ వద్దు అని హెచ్చరించారు. దగ్గర్లో ఉన్న చంద్ర నాయక్ తండా వాసులను కూడా పోలీసులు అలెర్ట్ చేశారు.
ఎక్కువ శాతం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పరిసరాల ప్రాంతాల్లో చిరుత సంచారం చేసిన సంగతి తెలిసిందే. దాన్ని పట్టుకున్న పోలీసులు అడవిలో వదిలి పెట్టారు. కానీ, ఇలా జనావాల మధ్య చిరుత సంచారం కలకలం రేపుతోంది. వెంటనే చిరుతను పట్టుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. మియాపూర్ మెట్రో స్టేషన్ వెనుక నిర్మాణంలో భాగంగా తవ్వకాలు జరిపారు. వాటిపై నుంచి చిరుత వెళుతున్న వీడియో వైరల్ అవుతోంది. 500 ఏకరాల దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. ఆ దట్టమైన అడవిలో అది వెళ్లి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు.
Viral Video: దండం తల్లి.. వలలో చిక్కుకున్న పామును ధైర్యం చేసి కాపాడిన ధీరవనిత..! వీడియో వైరల్..
Cheetah (#Leopard) spotted near Miyapur Metro Station, Hyderabad. pic.twitter.com/OHaxeB0Lo8
— Arbaaz The Great (@ArbaazTheGreat1) October 18, 2024
హైదరాబాద్ వాసులకు ప్రస్తుతం చిరుత భయం పట్టుకుంది. అడుగు బయట పెట్టాలంటే కూడా స్థానికులు భయపడుతున్నారు. అక్కడ నడిగడ్డ తండా, లక్ష్మీనగర్ ప్రాంతాల్లో చాలామంది కూలీ పనులు చేసుకునేవారు నివసిస్తున్నారు. ఫారెస్ట్ అధికారుల ప్రకారం పక్కనే రిజర్వ్‌డ్ ఫారెస్ట్‌కు చెందిన కొన్ని ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. అక్కడ చెరువు గట్టుపై చిరుత సంచరించిన విజువల్స్ కనిపిస్తున్నాయి.
కానీ, అటవీ శాఖ అధికారులు అది చిరుతనా? లేదా అడవి పిల్లినా? అనే దర్యాప్తు చేస్తున్నారు. కానీ, స్థానికులు మాత్రం అది కచ్చితంగా చిరుతనే అంటున్నారు. అది నడిచే విధానం చూస్తే కూడా అది చిన్న చిరుత అని నిర్ధారిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు నిర్ధారణకు రావాల్సి ఉంది. రాత్రి తాము ఉన్న ప్రాంతాల్లోకి ఎక్కడ చిరుత వస్తుందో అని స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈ చిరుత ఒక్కటే ఉందా? మరిన్ని ఉన్నాయా? అనే ఆందోళన చెందుతున్నారు.
ఇదిలా ఉండగా ఎక్కడో ఒకచోట చిరుతలు గ్రామాల్లోకి రావడం ఆ పరిసరా ప్రాంతాల్లో సంచరించడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఎవరో ఒకరు ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతారు. అయితే, ఇటీవల తిరుమల మెట్ల మార్గంలో కూడా చిరుత దృశ్యాలు కనిపించడం మనం చూసే ఉన్నాం. లేదా పొలాల్లో చిరుత సంచరించడం వంటి వైరల్ వీడియో చూశాం. కానీ, ఇక్కడ ఏకంగా నగరం నడిబొడ్డులో చిరుత సంచారం కలకలం రేపుతోంది. స్థానికులు బిక్కుబిక్కున గడుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter