Epfo New Scheme 2024 Good News: కేంద్ర ప్రభుత్వం EPFO సభ్యులందరికీ గుడ్ న్యూస్ తెలిపింది. ఈపీఎఫ్ఓ మెంబర్స్ అందరికీ బీమా ప్రయోజనాలను పెంచుతున్నట్లు ప్రభుత్వ కీలక ప్రకటన చేసింది. ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం కింద ఉద్యోగుల జీవిత బీమా రక్షణను రూ.7 లక్షల వరకు అందించబోతున్నట్లు తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం EDLI పథకం కింద పెంచిన కవరేజ్ ఏప్రిల్ 28 నుంచే అందుబాటులోకి తీసుకు వచ్చింది. కానీ ఈ పథకం గురించి ఇప్పటి వరకు చాలా మదికి తెలియదు..
కేంద్రం ఈ EPFO పథకాన్ని 1976 సంవత్సరంలో స్థాపించింది. ఇది ఈపీఎప్ఓ సభ్యుడు మరించిన సందర్భంగా వారి భార్య, పిల్లలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అంతేకాకుండా కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.
2018 నుంచి 2021 వరకు సంవత్సరాల్లో మరిణించిన మెంబర్స్‌కి సంబంధించిన నమ్మీలకు, చట్టపరమైన వారి కుటుంబ సభ్యులకు కేంద్రం రూ.6 లక్షల పరిమితితో పాటు ప్రత్యేకమైన బీమా కవరేజీని అందిస్తుంది..
పెరుగుతున్న ఖర్చులు, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం 2021 సంవత్సరంలో ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ కవరేజీని పెంచింది. గరిష్టంగా దీనిని ఏకంగా రూ.7 లక్షలుగా చేసింది.
కేంద్రం ఇటీవలే తీసుకున్న నిర్ణయంతో EPFO సభ్యులందరికీ రూ.7 లక్షల వరకు జీవిత బీమా అందుతుందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. దీని ద్వారా దాదాపు 6 కోట్ల మంది ప్రయోజనాలను పొందనున్నారు.
కేంద్ర మంత్రి తెలిపిన వివరాల ప్రకారం, ఈ జీవిత భీమా ఏప్రిల్ 28వ తేది నుంచే అమలులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఈ బీమా ద్వారా చాలా మంది లబ్ధి పొందినట్లు తెలుస్తోంది.