Navaratri 2024: నవరాత్రి 4వ రోజు అమ్మవారిని ఇలా పూజిస్తే లక్ష్మీ కటాక్షమే..!
Navaratri 4 th day 2024: నవరాత్రుల్లో అమ్మవారిని అత్యంత వైభవోపేతంగా పూజిస్తారు. ముఖ్యంగా నవరాత్రుల్లో దుర్గా దేవిని 9 రూపాల్లో అలంకరించి, 9 రోజులపాటు పూజిస్తారు. అందుకే వీటికి నవరాత్రి అని పేరు వచ్చింది. దసరా పండుగ ముందు నవరాత్రులు వస్తాయి. ఆ తర్వాత వచ్చే దశమి రోజు విజయ దశమి జరుపుకుంటారు.
ఈ సారి దసరా అక్టోబర్ 12వ తేదీ శనివారం రానుంది. అయితే, నరాత్రులు ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి ప్రారంభమైంది. నాలుగో రోజు అక్టోబర్ 6వ తేదీ అమ్మవారి రూపం మహాలక్ష్మి రూపం. ఈ రూపంలో అమ్మవారిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోతుంది.
నవరాత్రిలు పసుపు కుంకుమతో అమ్మవారిని పూజిస్తారు. అయితే, మహాలక్ష్మి అమ్మవారికి ఈరోజు గులాబీ రంగు చీరను సమర్పిస్తారు. ఇంకా ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా కదంబం సమర్పిస్తారు. చక్కెర పొంగలి కూడా అమ్మవారికి ఇష్టం. లేకపోతే తెలుపు రంగులో ఉండే స్వీట్లను అమ్మవారికి సమర్పించవచ్చు.
లక్ష్మీదేవి పూజలో గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలు కూడా తప్పనిసరి. ఓం శ్రీమాత్రే నమః అని జపించాలి. పూజలో అష్టోత్తరాలు పటించాలి. ముఖ్యంగా ఈరోజు ఏక హారతి దీపారాధన చేయాలి. అంతేకాదు కామక్షీదీపం పెట్టుకోవాలి. ఈరోజు అమ్మవారిని కనీసం 21 నామాలైన పటించాలి.
నవరాత్రుల్లో పూజించలేనివారు కనీసం ఐదు, మూడు రోజులైనా దుర్గామాతను పూజించాలి. దీంతో అమ్మవారి చల్లని చూపు మీపై ఉంటుంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)