Navaratri 2024: నవ రాత్రుల్లో 7వ రోజు ఎంత ప్రత్యేకమో తెలుసా? ఇలా చేస్తే సకల సౌభాగ్యాలు..
నవరాత్రుల్లో అమ్మవారి 9 అవతారాల్లో పూజిస్తారు. అయితే, బెజవాడ ఇంద్రకీలాద్రిపై ఏ రోజు ఏ అమ్మవారిని పూజిస్తారో అదే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రామాణికంగా తీసుకుంటారు.
నవరాత్రిలు ఈ ఏడాది అక్టోబర్ 3న ప్రారంభమైంది. ఇది అక్టోబర్ 12 విజయదశమితో పూర్తవుతుంది. నవరాత్రుల్లో అష్టమి కూడా విశేష ప్రయోజనాలు ఇస్తుంది. అయితే, ఆరోజు దుర్గాష్టమిగా కూడా జరుపుకొంటారు.
నవరాత్రి 7వ రోజు అత్యంత విశేషమైన రోజు. నేడు మూలనక్షత్రం కాబట్టి ఈరోజు దుర్గామాతను సరస్వతి రూపంలో పూజిస్తారు. అమ్మవారికి తెలుపు రంగు చీర సమర్పిస్తారు.
ఈరోజు సరస్వతి కటాక్షం కలగాలని అక్షరాభ్యాసం కూడా చెబుతారు. పసుపు, కుంకుమ, అక్షితలతో అమ్మవారిని పూజించాలి. ఈ పూజలో పిల్లలు కూడా ఉండేలా చూడాలి.దీంతో వారికి మంచి జ్ఞానం కూడా కలుగుతుంది.
అంతేకాదు ఈ రోజు అమ్మవారికి ప్రసాదం దద్దోజనం పెడతారు. పిల్లలకు చదువు, జ్ఞానం బాగా రావాలని కోరుకుంటూ పూజిస్తారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)