Nayanthara: తప్పులు చేసే వారు భయపడాలి.. నాకేంటీ..?.. బహిరంగ లేఖపై మరో బాంబు పేల్చిన నయనతార..
నయన తార , ధనుష్ వివాదం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.దీనిపై ఏ ఒక్కరు కూడ తగ్గేదేలా అన్న విధంగా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తొంది.
నయన తార.. జీవిత చరిత్ర ఆధారంగా నయన తార బియాండ్ దిఫెయిరీటెల్ అనే డ్యాక్యుమెంట్ ను రూపొందించారు. అయితే.. దీనిలోని కొన్ని సీన్స్ ను.. తమ నానుమ్ రౌడీ దాన్ కోసం తీసుకుంటామని నయన్ దంపతులు కోరారంట.
అయితే.. దీనికి ధనుష్ ఒప్పుకోలేదంట. కనీసం మాట్లాడేందుకు చూసిన కూడా అవకాశం ఇవ్వలేదంట. ఫోన్ లు ఎత్తలేదంట. మెనెజర్ తో మాట్లాడించిన కూడా పట్టించుకోలేదంట. ఎన్నో ఏళ్లు ఎన్ వోసీ ఇవ్వమన్న పట్టించుకోలేదంట.
ఈ క్రమంలో నయన్ దంపతులు.. మూడుసెకన్లను వీరి డాక్యుమెంటలో ఉపయోగించుకున్నట్లు తెలుస్తొంది.దీంతో ధనుష్ తనకు 10 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని నోటీసులు పంపించాడు. అదే విధంగా మద్రాస్ హైకొర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీంతో ధనుష్ వ్యక్తిత్వం గురించి ఏకీపారేస్తు నయన్ పోస్ట్ పెట్టింది. ఇది రచ్చకు కారణమైందని చెప్పవచ్చు. తాజాగా.. ఒక ఇంటర్వ్యూలో దీనిపై ఇంత ధైర్యం మీకు ఎలా వచ్చిందని అడిగారంట. దానికి నయన్... సమాధానంగా.. తప్పుడు పనులు, తప్పుడు పనులు చేసే వారు భయపడాలి.. నాకేం భయం అంటూ కౌంటర్ ఇచ్చారంట.
తాము లీగల్ గానే తెల్చుకుంటామని కూడా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తొంది. మరొవైపు మద్రాస్ హైకొర్టు నయనతారకు నోటీసులు జారీచేసింది. జనవరి 8 వరకు..ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని చెప్పినట్లు తెలుస్తొంది.