NBK Legend Movie 10 Years Celebrations: గ్రాండ్‌గా బాలకృష్ణ `లెజెండ్` 10 ఇయర్స్ సెలబ్రేషన్స్.. సాధించిన రికార్డులు ఇవే..

Fri, 29 Mar 2024-12:30 pm,

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన రెండో మూవీ 'లెజెండ్'. సరిగ్గా పదేళ్ల క్రితం 2014 మార్చి 28న విడుదలైన ఈ సినిమా ఈ గురువారంతో దశాబ్దాం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు.

అంతేకాదు అప్పట్లో లెజెండ్ సినిమా ఘన విజయం తెలుగు దేశం పార్టీ ఎన్నికల్లో గెలుపుకు ఓ ఊపు తీసుకొచ్చింది. సింహా తర్వాత సరైన సక్సెస్‌లేని బాలయ్యకు మళ్లీ లెజెండ్ మూవీతో మళ్లీ పవర్‌ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు.

లెజెండ్ మూవీ బాలయ్య కెరీర్‌లోనే తొలి రూ. 40 కోట్ల షేర్ అందుకున్న చిత్రంగా రికార్డులకు ఎక్కింది. అంతేకాదు బాలయ్య వరుస పరాజయాలకు ఈ సినిమా బ్రేకులు వేసింది.

అంతేకాదు డిజిటల్ యుగంలో ఈ సినిమా దాదాపు 1000 రోజులు ప్రదర్శించబడిన చిత్రంగా లెజెండ్ తన పేరిట మరో రికార్డును రాసుకుంది.

లెజెండ్ మూవీ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ'తో ఘన విజయం సాధించింది. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో హాట్రిక్ హిట్‌గా నిలిచింది. ఇపుడు అదే ఊపులో ఈ సినిమాకు సీక్వెల్‌గా 'అఖండ 2' రాబోతుంది.

లెజెండ్ సినిమా రిలీజై 10 యేళ్లు పూర్తైన సందర్బంగా ఈ సినిమాను మళ్లీ గ్రాండ్‌గా రీ రిలీజ్ చేస్తున్నారు. మరి రీ రిలీజ్‌లో ఈ సినిమా ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link