NBK Unstoppable Season 4: చిరు, రేవంత్ సహా బాలయ్య 4 th సీజన్లో గెస్ట్స్ వీరే..

Sun, 13 Oct 2024-8:44 am,

నందమూరి బాలకృష్ణ తొలసారి హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ షో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందే తెలిసిందే కదా. మన దేశంలోనే కపిల్ శర్మ మించిపోయింది. ఇప్పటికే అన్ స్టాపబుల్ రెండు సీజన్లు పూర్తి చేసుకున్నాయి. మూడో సీజన్ లో రెండు మూడు ఎపిసోడ్స్ మాత్రమే పరిమితమైంది. కానీ సీజన్ 4ను మాత్రం ఎంతో అట్టహాసంగా రెడీ చేస్తున్నారు.

అయితే  బాలయ్య టాక్ షోకు ఫస్ట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి.. చివరి ఎపిసోడ్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో క్లోజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.

మరోవైపు ఈ టాక్ షో మెగాస్టార్ చిరంజీవితో చేసే ఎపిసోడ్ కోసం మెగా, నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా  ఎదురు చూస్తున్నారు. అటు రేవంత్ టాక్ షో పై భారీ అంచనాలే ఉన్నాయి.

మరోవైపు నాగార్జునతో కూడా బాలయ్య ఎపిసోడ్ కూడా ప్లాన్ చేసినట్టు సమాచారం. గత కొన్నేళ్లుగా ఉప్పు, నిప్పుగా ఉన్నవీళ్లిద్దరు ఈ టాక్ షోలో ఏం మాట్లాడుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

అటు వెంకటేష్ కూడా ఈ సీజన్ 4లో సందడి చేయనున్నాడు. మొత్తంగా తన తరం హీరోలతో ఈ టాక్ షోను ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది.

 

అటు రామ్ చరణ్ కూడా ఓ ఎపిసోడ్ ప్లాన్ చేసినట్టు సమాచారం. అటు ఎన్టీఆర్ తో బాలయ్య టాక్ షో ఉంటుందా అనే అనుమానాలున్నాయి.

అటు బాలకృష్ణ షో కి మలయాళం సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్.. లక్కీ భాస్కర్ మూవీ ప్రమోషన్ లో భాగంగా హాజరు కానున్నాడట. మొత్తంగా  బాలయ్య సీజన్ 4 మాత్రం ప్రేక్షకులకు కిక్ ఇవ్వడం పక్కా అని చెబుతున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link