Tigers Turn Sadhus: ఇదేం విడ్డూరం.. శనివారం ఆ జూలో పులులు మాంసం ముట్టుకోవు.. కారణం ఏంటంటే..?

Thu, 11 Apr 2024-3:56 pm,

సాధారణంగా క్రూర జంతువులు సింహాలు, పులులు, చిరుత పులులు, ఎలుగు బంట్లు ఎక్కువగా అడవుల్లో నివసిస్తుంటాయి. ఇవి అడవులలో సాధు జంతులను వేటాడుతుంటాయి. అదే విధంగా కొన్ని జూలు, నేషనల్ పార్కులలో కూడా క్రూర జంతువులు ఉంటాయి.

ఈ క్రూరమైన జంతువులకు జూ సిబ్బంది రెగ్యులర్ గా వాటి ఆహారం నియమాలకు తగ్గట్టుగా నాన్ వెజ్ లను పెడుతుంటారు. ఇదంతా మనకు తెలిసిందే.  జూలలో టైమ్ ప్రకారం జంతువులకు సిబ్బంది అనేక వెరైటీల ఆహారం అందిస్తు ఉంటారు. రెగ్యూలర్ గా వెటర్నరీ వైద్యులు జంతువుల హెల్త్ ను గమనిస్తుంటారు.

నేపాల్ లోని సెంట్రల్ జంతు ప్రదర్శన శాలలో విచిత్రమైన డైట్ ను ఫాలో అవుతున్నాయి. ఇవి వారానికి ఓకరోజు అస్సలు మాంసంను ముట్టుకోవంట. అంటే ప్రతి శనివారం రోజున.. పులులు మాంసం తినవంట. జూ సమాచార అధికారి గణేష్ కొయిరాలా ప్రకారం.. పులులు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రతి శనివారం 'ఉపవాసం' ఉంచుతారు. ఉపవాస సమయంలో జంతువులకు ఎలాంటి ఇబ్బంది కలగదన్నారు.

పులులను 'ఉపవాసం' ఉంచడం  వెనుక కారణం.. బరువు పెరగకుండా వాటిని రక్షించడానికి, అదే విధంగా వేటాడేటప్పుడు అలసి పోకుండా ఉండేందుకు ఇలా వీక్లీ ఒకరోజు మాంసం ఇవ్వమని జూ అధికారులు తెలిపారు. జంతుప్రదర్శనశాలలో ఆడ పులులకు ఐదు కిలోల గేదె మాంసం, మగ పులులు రోజుకు 6 కిలోల మాంసాన్ని తింటాయన్నారు. 

కానీ శనివారాల్లో, కీపర్లు వారి జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి మాంసం తినిపించరు.  ఎందుకంటే ఈ జంతువులు ఊబకాయంగా మారినప్పుడు, అనేక రకాల సమస్యలు తలెత్తుతాయన్నారు.జంతువులకు ఔషధాలు వాడితే వాటి జీవన ప్రమాణంపై ప్రభావం పడుతుందన్నారు. కొన్నిసార్లు..దీర్ఘకాలిక పరిణామాలకు దారితీయవచ్చు.

మాంసాహార జీవులు ఒక రోజు ఉపవాసం ఉన్నప్పుడు వారి ఆరోగ్యంపై విశేషమైన సానుకూల ప్రభావాన్ని కూడా నిపుణులు గుర్తించారు. చెదపురుగుల వంటి చిన్న కీటకాల నుండి పెద్ద ఏనుగు దూడల వరకు పులులు విభిన్నమైన ఆహారం కోసం ప్రసిద్ధి చెందాయి. అయినప్పటికీ, కనీసం 20 కిలోల (45 పౌండ్లు) బరువున్న దుప్పి, జింకలు, పందులు, ఆవులు, గుర్రాలు, గేదెలు,  మేకలు వంటి పెద్ద జంతువులను తినడం ద్వారా వాటి ప్రాథమిక పోషణ లభిస్తుంది. 

నేపాల్‌లోని సెంట్రల్ జూ, జవాలాఖేల్ పరిసరాల్లో ఉంది. 109 విభిన్న జాతుల నుండి వచ్చిన 969 జంతువులకు ఇక్కడ ఆవాసం లభిస్తుంది. ప్రస్తుతం నేషనల్ ట్రస్ట్ ఫర్ నేచర్ కన్జర్వేషన్ (NTNC)చే నిర్వహించబడుతోంది.  6 హెక్టార్లు లేదా 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ జంతుప్రదర్శనశాల మొదట ఒక ప్రైవేట్ సంస్థ, ఆ తరువాత 1956 నుంచి ప్రజలు ఈజూకు ఎక్కువగా సందర్శన కోసం వస్తున్నారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link