Sravana masam 2024: శ్రావణ మాసంలో శివుడికి ఈ 6 వస్తువులు పొరపాటున కూడా సమర్పించ కూడదు..
శ్రావణాన్ని చాలా మంది పండుగల మాసంగా చెప్తుంటారు. ఈ నెలలో.. ముఖ్యంగా.. వరలక్ష్మి వ్రతం, నాగుల పంచమి, జన్మాష్టమి తదతర పండుగలు మనం జరుపుకుంటాం. ఆగస్టు నెల ఐదు నుంచి శ్రావణ మాసం ప్రారంభమౌతుంది. ఈ క్రమంలో శ్రావణంలో చాలా మంది శివుడిని పంచామృతాలతో అభిషేకం చేస్తుంటారు.
శివుడిని భోళాశంకరుడి అని పిలుస్తుంటారు. శివయ్యకు కేవలం చెంబెడు నీళ్లు, బిల్వదళాలు సమర్పిస్తే ఆయన మన కోరికలన్ని నెరవేరుస్తాడు. అదే విధంగా శివుడిని పూజించేటప్పుడు కొన్ని పొరపాట్లు మాత్రం అస్సలు చేయకూడదని పండితులు చెబుతుంటారు.
శివుడిని పూజించేటప్పుడు.. శివుడ్న భూమి మీద పెట్టొద్దంటారు. తులసీ ఆకుల్ని మాత్రం అస్సలు సమర్పించకూడదంట. తులసి జలంధరుడు అనే రాక్షసుడి భార్య. అందుకే తులసీని శివుడి పూజలో ఉపయోగించకూడదని చెప్తుంటారు.
అదే విధంగా పసుపు, కుంకుమలను కూడా శివుడి పూజలో ఉపయోగించకూడదని చెప్తుంటారు. పసుపు, కుంకుమలు.. జీవితంలో ఏ శుభకార్యం కూడా పసుపు, కుంకుమలు లేకుండా జరుపుకోము. కానీ శివుడు స్మశానంలో ఎక్కువగా సంచరిస్తాడు. అందుకే ఆయనకు చందనం లేదా భస్మంను సమర్పించాలని చెప్తుంటారు.
చెడిపోయిన బిల్వపత్రాలు, ముదిరిపోయిన బిల్వపత్రాలు శివలింగానికి పొరపాటున కూడా సమర్పింకూడదు. కేవలం పూర్ణంగా, పచ్చగా ఉన్న మూడు ఆకులున్న బిల్వపత్రాలను మాత్రమే శివపూజలో ఉపయోగించాలి.
శివుడికి చాలా మంది పాలు, పెరుగు, తేనె,నెయ్యి, చక్కెరతో అభిషేకం చేస్తుంటారు. ఇలా అభిషేకం చేసేటప్పుడు కంచు పాత్రలను అస్సలు ఉపయోగించకూడదని చెప్తుంటారు.
అదే విధంగా అతి ముఖ్యంగా శివ పూజలో అస్సలు శంఖాన్ని ఉపయోగించకూడదంట. పూర్వం శివుడు శంఖ చవుడు అనే రాక్షసుడిని హతమార్చాడంట. అందుకే శివుడి పూజలో శంఖాన్ని వాడొద్దని జ్యోతిష్య పండితులు చెప్తుంటారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)