Bank Rules: బ్యాంక్ లాకర్ వాడేవారికి కొత్త రూల్స్..కీలక అప్ డేట్స్ ఇవే

Fri, 06 Dec 2024-6:55 pm,

Bank Rules:  భారత ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్ హెల్డర్లకు మరిన్ని మెరుగైన సేవలందించే లక్ష్యంతో కీలక చర్యలు తీసుకుంది. కస్టమర్లకు ఫ్లెక్సిబిలిలీ, సెక్యూరిటీ అందించేలా కొత్త నిబంధనలను ప్రకటించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ బిల్లు 2024ను ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లుకు పార్లమెంటులో ఆమోదం లభించింది. ఈ  కొత్త చట్టంలో పేర్కొన్న నిబంధనలు ఎలా ఉన్నాయి. ఎలాంటి ప్రయోజనాలను అందించనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.   

లాకర్ హోల్డర్ల కోసం కొత్త చట్టంలో కొత్త రూల్స్ ప్రతిపాదించారు. మీరు నామినీలను సీక్వెన్షియల్ గా చేర్చుకోవచ్చు. అంటే లాకర్ లోని వస్తువులను మొదటి నామినీ క్లెయిమ్ చేయనట్లయితే వరుసలో ఉన్న తదుపరి నామినీ బాధ్యతలను తీసుకుంటారు. దీంతో లాకర్ విషయాల్లో కుటుంబ సభ్యుల మధ్య చట్టపరమైన వివాదాలు కూడా తగ్గే చాన్స్ ఉంటుంది. అకౌంట్ లేదా లాకర్ హోల్డర్ల కుటుంబాలకు ప్రాపర్టీలను సులువుగా అందించే ఛాన్స్ ఉంటుంది. చట్టపరమైన సమస్యలతో ఎలాంటి ఆలస్యం ఉండదు. 

ప్రతి బ్యాంకు అకౌంట్ కు తప్పనిసరిగా నామినీని సెలక్ట్ చేసుకోవాలన్న విషయం తెలిసిందే. అయితే కొత్తగా ఒక అకౌంట్ కు నలుగురు నామినీలను సెలక్ట్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. ఖాతాదారులు ప్రతి నామినీకి ఎంత శాతం అకౌంట్ ఫండ్స్ అందాలో నిర్ణయించుకునే ఛాన్స్ ఉంటుంది.

ఇంతకుముందు బ్యాంక్ అకౌంట్ లేదా లాకర్ కు ఒక నామినీని మాత్రమే కేటాయించేవారు. ఖాతాదారులకు వారి డబ్బును ఇష్టానుసారంగా అందించడం కష్టంగా ఉండేది.  ఈ సమస్యల పరిష్కారానికే కొత్త మార్పులు తీసుకువచ్చారు.   

బ్యాంకింగ్ రెగ్యులేషన్ బిల్లు 2024లో ఇప్పటికే ఉన్న బ్యాంకింగ్ చట్టాలకు 19 సవరణలు  చేశారు. అందులో కీలకంగా బ్యాంకింగ్ సంస్థల కంట్రోల్ రెగ్యులేషన్ మెరుగుపరచడం, వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడం, బ్యాంక్ స్థిరత్వంపై ఫోకస్ పెట్టడం లాంటివి ఉణ్నాయి.

2014 నుంచి బ్యాంకులు స్థిరత్వం, వ్రుత్తిపరమైన నిర్వహణను నిర్ధారించేందుకు ప్రభుత్వం, ఆర్బిఐ కలిసి పనిచేశాయని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజలకు భరోసా కల్పించారు. ఈ విధానం బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేసింది. దీన్ని ఆమె అందరి విజయంగా చెప్పుకొచ్చారు.   

ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాలను ప్లాన్ చేయడం లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఓ ప్రకటనలో తెలిపారు. 2019లో పది బ్యాంకులు నాలుగు పెద్ద సంస్థలుగా విలీనమయ్యాయి. తదుపరి విలీనాలు ఏమీకూడా ఎజెండాలో లేవు.   

కాగా బిల్లుపై చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడారు. ప్రభుత్వ బ్యాంకులు పటిష్టంగానే ఉన్నాయని... కొన్నేళ్లుగా అద్భుత పనితీరు కనబరుస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక ఏడాది తొలి 6 నెలల్లో రూ.85,520 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు మంత్రి తెలిపారు. కమర్షియల్‌ బ్యాంకుల మొత్తం శాఖల సంఖ్య ఏడాదిలో 3,792 పెరిగి, ఈ ఏడాది సెప్టెంబరు చివరకు 16,55,001కు చేరినట్లు పేర్కొన్నారు.  85,116 శాఖలు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. దేశ వృద్ధికి బ్యాంకింగ్‌ వ్యవస్థ ఎంతో కీలకం అందుకే  బ్యాంకింగ్‌ వ్యవస్థ  మరింత బలోపేతానికి 2014 చర్యలు తీసుకున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link