New York Floods: న్యూయార్క్‌లో వరద బీభత్సం, ఎటు చూసినా నీళ్లే, వరద దృశ్యాలివే
విమానాశ్రయంలో ఇంధనం నింపే ప్రాంతాలు నీట మునిగిపోవడంతో రాకపోకలు ఆలస్యమౌతున్నాయి. వరద కారణంగా మూడు టెర్మినల్స్‌లో ఒకటి మూసివేశారు.
సబ్‌వే, రైలు పట్టాలపై సైతం నీరు చేరుకోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇంట్లోంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు.
జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని నీళ్లలో కారుతో సహా చిక్కుకున్న ఓ మహిళ తెలిపింది. చాలా ప్రాంతాల్లో బేస్‌మెంట్ వరకూ నీళ్లు కన్పిస్తున్నాయి.
తుపాను, భారీ వర్షాల కారణంగా రాకపోకలు స్థంభించిపోయాయి. మన్‌హట్టన్ తూర్పు ప్రాంతంలో ప్రధాన రహదారిపై కార్లు, వాహనాలు నీట మునిగిపోయాయి.
ఇది చాలా భయంకరమైందని, జీవితాల్ని ప్రమాదానికి నెట్టివేసే తుపాను అని న్యూయార్క్ గవర్నర్ హెచ్చరించారు. రానున్న 20 గంటల వరకూ ఇదే పరిస్థితి ఉండవచ్చన్నారు.
న్యూయార్క్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రంతా 13 సెంటీమీటర్ల మేర భారీ వర్షం నమోదైంది. పగలు 18 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది.