Nidhhi Agerwal: నిధి అగర్వాల్ అందాలు బ్లాస్ట్.. గ్లామర్ విషయంలో అన్ని హద్దులు చెరిపేసిన పవన్ భామ..
నిధి అగర్వాల్..బాలీవుడ్ హీరోగా టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన 'మున్నా మైఖేల్' చిత్రంతో కథానాయకగా పరిచయమైంది. ఆ తర్వాత నిధి వెనుదిరిగి చూసుకుంది లేదు.
తెలుగులో అక్కినేని నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ‘సవ్యసాచి’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్.
నిధి అగర్వాల్‌కు ఉత్తరాది కంటే.. తెలుగులో కంటే తమిళంలో కథానాయికగా పాపులర్ అయింది. అంతేకాదు అక్కడ ముఖ్యంగా తమిళ అభిమానులతో నిధికి గుడి కట్టించుకునే రేంజ్‌కు ఎదిగింది.
నిధి అగర్వాల్.. ముంబైలో మోడల్‌గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత కథానాయికగా తన కంటూ సెపరేట్ ఐడెండిటీ సంపాదించుకుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్‌తో ఈమె కెరీర్ రాకెట్ స్పీడ్ లా దూసుకుపోయింది.
త్వరలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న హరి హర వీరమల్లు సినిమాతో పలకరించబోతుంది నిధి అగర్వాల్. ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతుంది.మొదటి భాగం మార్చి చివరి వారం 28వ తేదిన విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
అటు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తూన్న ‘ది రాజా సాబ్’ సినిమాలో కూడా ఆమె మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు రెండు వారాల గ్యాప్ లో విడుదల కాబోతున్నాయి. మొత్తంగా వచ్చే యేడాది అమ్మడి కెరీర్ కు కీలకం అని చెప్పాలి.