Aryaman Birla: ఆస్తుల్లో కోహ్లీ, ధోనీ దిగదుడుపే.. దేశంలోనే కాదు ప్రపంచంలోనే సంపన్న క్రికెటర్ ఇతడే!
Aryaman Birla: సంపాదనలో విరాట్ కోహ్లీ, ధోనీని కాదని భారత్‌లో అత్యంత సంపన్న క్రికెటర్ ఒకరు ఉన్నారు. అతడి ఆస్తి కొన్ని కోట్లలో ఉంది.
Aryaman Birla: క్రికెట్‌లో ప్రతిభ చాటినకొద్ది ఆటగాళ్ల సంపద పెరుగుతుంది. ఇప్పుడు దాదాపు ప్రతి క్రికెటర్ కోటి రూపాయలలో పారితోషికం పొందుతున్నాడు. విదేశీ క్రికెటర్ల కంటే భారత క్రికెటర్లు ఎక్కువ సంపాదిస్తున్నారు.
Aryaman Birla: ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా భారత క్రికెట్ నియంత్రణ బోర్డ్ (బీసీసీఐ) అవతరించింది. క్రికెటర్‌లలో విరాట్ కోహ్లీ, ధోనీ అత్యధిక ధనవంతులు అని అందరూ భావిస్తున్నారు.
Aryaman Birla: ధోని, కోహ్లీ కన్నా అత్యధిక ఆదాయం కలిగిన క్రికెటర్ ఆర్యమాన్ బిర్లా. ఇతడు ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా కుమారుడు. ఇతడు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెటర్‌గా ఆర్యమన్ బిర్లా నిలుస్తున్నాడు.
Aryaman Birla: దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తలలో కుమార్ మంగళం బిర్లా ఒకరు. అతడి కుమారుడు ఆర్యమాన్ బిర్లా వ్యాపారంతో పాటు క్రికెట్‌లో రాణిస్తున్నాడు.
Aryaman Birla: 2017లో క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఆర్యమాన్ బిర్లా మధ్యప్రదేశ్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెటర్‌గా నిలిచాడు. అయితే 2019లో అనూహ్యంగా క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
Aryaman Birla: తన 22 ఏళ్ల వయసులోనే ఆర్యమాన్ బిర్లా క్రికెట్ నుంచి విరామం తీసుకోవడం గమనార్హం. అయితే మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా క్రికెట్‌కు వీడ్కోలు పలికినట్లు సమాచారం.
Aryaman Birla: ఆర్యమాన్ బిర్లా ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 16 ఇన్నింగ్స్‌లు ఆడాడు. 27.60 సగటుతో 414 పరుగులు చేశాడు.
Aryaman Birla: క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం ఆర్యమాన్ బిర్లాకు దాదాపు రూ. 70,000 కోట్ల ఆస్తులు ఉండవచ్చు. అంతేకాకుండా అతడి కార్లు, వాచీలు వంటివి కలిపితే 80 వేల కోట్లపైన ఉంటాయని సమాచారం.