November Astrology: నవంబర్ నెలలో మారిపోనున్న ఆ రాశుల జాతకం, పట్టిందల్లా బంగారమే
జ్యోతిష్యం ప్రకారం కన్యారాశి జాతకులకు నవంబర్ నెలలో ఊహించని అభివృద్ధి కలుగుతుంది. సూర్యుడు, గురుడు మంచి స్థితిలో ఉండటం ప్రయోజనకరం. మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసేవారికి అనువైన సమయం.
శుక్రగోచారం సింహరాశి జాతకులకు మంచి లాభాల్ని ఆర్జిస్తుంది. శుక్రుడు వృశ్చికంలో ప్రవేశించడం లాభదాయకంగా ఉంటుంది. అటు మంగళ గోచారం విద్యార్ధులకు మంచి ఫలితాలనిస్తుంది. బుధుడు ఈ రాశి జాతకుల వ్యాపారంలో లాభాల్ని ఇస్తాడు. వ్యాపారం ప్రారంభించేందుకు అనువైన సమయం.
నవంబర్ నెలలో కర్కాటక రాశి జాతకులకు ప్రయోజనం చేకూరనుంది. సూర్య గోచారం, గురు వక్రమార్గం శుభసూచకంగా మారనుంది. ఈసమయంలో వ్యాపారం లాభాల్ని తెచ్చిపెట్టవచ్చు. విద్యార్ధులకు ఈ సమయం చాలా అనుకూలం. కొత్త అవకాశాలు లభిస్తాయి. దాంతోపాటు కెరీర్ కూడా వృద్ధి చెందుతుంది.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మేషరాశి గురువైన గురుడు వక్రమార్గం కారణంగా ఈ రాశి జాతకులకు చాలా లాభం కలగనుంది. ఈ సమయంలో వారసత్వం లేదా ఇతర పద్ధతుల్లో ప్రయోజనం పొందుతారు. అటు సూర్య గోచారం కూడా కలిసొస్తుంది. ఈ కాలంలో వారికి విజయం లభిస్తుంది. అటు శుక్ర గోచారం వ్యాపారులకు కలిసొస్తుంది.