NTR Heroes Record: ఆ విషయంలో నందమూరి హీరోల ప్రపంచ రికార్డు.. సినీ ఇండస్ట్రీలో మరే ఫ్యామిలీకి సాధ్యం కానీ ఫీట్..

Sun, 25 Aug 2024-10:41 pm,

NTR Heroes Record: తెలుగులో సినీ చరిత్రలో పౌరాణిక చిత్రాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది అన్న ఎన్టీఆర్ గారే. అంతేకాదు ఆయన లెగసీని ఆయన తనయుడు బాలయ్య, మనవడు ఎన్టీఆర్ కంటిన్యూ చేస్తున్నారు. అయితే రాముడి వేషం విషయంలో రికార్డు క్రియేట్ చేసిన నందమూరి హీరోలు.. శ్రీకృష్ణుడి వేషధారలో మరో అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పారు. వేరే ఏ హీరోలకు ఇది సాధ్యం కాదు కూడా.

 

తారక్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆది’ సినిమాలో ఓ సాంగ్ ఉంది. అందులో నాటి రాముడి రూపం మాకు మాత్రం సొంతం’ అంటూ పాట పల్లవి ఉంటుంది. రాముడి పాత్ర విషయంలో రికార్డు సెట్ చేసిన నందమూరి హీరోలు.. శ్రీకృష్ణుడి పాత్రలో కూడా ఎవరికి సాధ్యం కానీ రికార్డును నెలకొల్పారు.

నందమూరి ఫ్యామిలీకి చెందిన ఎన్టీఆర్, ఆయన తనయులు హరికృష్ణ, బాలకృష్ణ, నాల్గో తరానికి చెందిన హరికృష్ణ మనవడు మాస్టర్ ఎన్టీఆర్ ఈ నలుగురు హీరోలు శ్రీకృష్ణుడి పాత్రలో ప్రేక్షకులను మెప్పించారు.

తెలుగు ప్రేక్షకులకు శ్రీకృష్ణుడు అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు ఎన్టీఆర్ దే. నందమూరి కుటుంబానికి చెందిన ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ, నాల్గో తరానికి చెందిన మాస్టర్ ఎన్టీఆర్  ఈ నలుగురు కథానాయకులు  శ్రీకృష్ణుడి వేషధారణతో ఆడియన్స్‌ను మెప్పించడం విశేషం.

ఇక తెలుగు ఆడియన్స్‌కు శ్రీకృష్ణుడు అంటే ముందుగా గుర్తొచ్చే రూపం రామారావుదే.మహా భారతంలో పద్దెనిమిది పర్వాలు ఎలాగో.. భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నట్టు.. అన్నగారు దాదాపు 18 చిత్రాల్లో శ్రీకృష్ణ భగవానుడి రూపంలో వెండితెరపై నటించి మెప్పించారు. ఒక నటుడు ఒక పాత్రను ఇన్ని సినిమాల్లో చేయడం అనేది వరల్డ్ రికార్డు అని చెప్పాలి.

ఎన్టీఆర్ ఫస్ట్ టైమ్ శ్రీకృష్ణుడిగా నటించిన చిత్రం ‘మాయా బజార్’. కానీ 1953లో రిలీజైన ‘ఇద్దరు పెళ్లాలు’ సినిమాలో అన్నగారు. ముప్పై యేళ్ల వయసులో ఓ డ్రీమ్ సాంగ్ లో తెలుగు తెరప కృష్ణుడి పాత్రలో ఫస్ట్ టైమ్ కనిపించారు. అలా 30పైగా చిత్రాల్లో వివిధ సందర్భాల్లో శ్రీకృష్ణుడి పాత్రలో తెరపై కనిపించడం అనేది రామారావు గారికే సాధ్యమైంది.

ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ నటుడిగా పరిచయమైన ‘శ్రీకృష్ణావతారం’ సినిమాలో ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషించారు. అందులో చిన్నప్పటి బాలకృష్ణుడి వేషంలో హరికృష్ణ తొలిసారి వెండితెరపై శ్రీకృష్ణ వేషంలో కనిపించడం విశేషం.

నందమూరి తారక రామారావు రెండో నట వారసుడిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. తండ్రి నట వారసత్వాన్ని కంటిన్యూ చేసారు. బాలయ్య.. పూర్తి స్థాయిలో ‘శ్రీకృష్ణార్జున విజయం’, ‘పాండు రంగుడు’ చిత్రాల్లో భగవాన్ శ్రీ కృష్ణ పాత్రలో కనిపించడం విశేషం. అంతేకాదు ‘మంగమ్మ గారి మనవడు’, పట్టాభిషేకం, సినిమాల్లో శ్రీ కృష్ణుడిగా అలా కనిపించి మురిపించారు.

అటు ‘బృందావనం’లో జూనియర్ ఎన్టీఆర్ మోడ్రన్ శ్రీకృష్ణ పరమాత్ముగా కనిపించాడు. కానీ రాజమౌళి కలల ప్రాజెక్ట్ అయిన ‘మహా భారతం’లో శ్రీకృష్ణుడి పాత్ర కోసం ఆల్రెడీ సెలెక్ట్ చేసి పట్టుకున్నాడు. అంటే ఎన్టీఆర్ ను త్వరలో శ్రీకృష్ణుడిగా కనిపించనున్నాడట.

మరోవైపు  నందమూరి నాల్గో రం నుంచి అంతా చిన్నపిల్లలతో తెరకెక్కిన ‘దాన వీర శూర కర్ణ’లో ఎన్టీఆర్ ముని మనవడు హరికృష్ణ పెద్ద కుమారుడైన జానకి రామ్ తనయుడు మాస్టర్ ఎన్టీఆర్ శ్రీ కృష్ణుడి పాత్రలో నటించి మెప్పించడం విశేషం.

ఇలా ఒక ఇంట్లోనే ఇంత మంది హీరోలు ఓ  పురాణ పాత్రను పోషించడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. అది నందమూరి హీరోలకే సాధ్యం అయిందనే చెప్పాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link