Nude Video Call: అర్ధరాత్రి ఎమ్మెల్యేకు మహిళా న్యూడ్ వీడియో కాల్.. వీడియో వైరల్..

Sat, 19 Oct 2024-10:21 am,

Viral: ప్రస్తుతం దేశం, సమాజం ఎక్కడి పోతుందో తెలియడం లేదు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు కొందరు తమ అసభ్యకర ప్రవర్తనతో ప్రజల్లో పలుచన అవుతున్నారు.

అంతేకాదు కొంత మంది తమ తోటి మహిళ కార్యకర్తలతో  ఎంతో అసభ్యకరంగా , జుగుప్సాకరంగా ప్రవర్తిస్తున్న వీడియోలు రాజకీయాల్లో కాక పుట్టిస్తున్నాయి.అంతేకాదు మగువల మత్తులో రాజకీయా నేతలు చిత్తవుతున్నారు.

చెప్పేవి నీతులు చేసేది మరొకటి అన్నట్లుగా నేతల తీరు ఉందని ప్రజలు మండిపడుతున్నారు. తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ నేతకు అర్ధరాత్రి ఓ మహిళ నుంచి న్యూడ్ కాల్ రావడం కలకలం రేపుతోంది. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ నెల 14న అర్ధరాత్రి గుర్తు తెలియని నెంబర్ నుంచి సదరు నేతకు ఓ వీడియో కాల్ వచ్చింది. తీరా లిఫ్ట్ చేస్తే ఓ మహిళ పూర్తి నగ్నంగా కనిపించింది.

హనీ ట్రాప్ లో భాగంగా ఎవరో తనను ఇరికించడానికి ఈ వీడియో కాల్ చేసినట్టు గుర్తించిన సదరు నేత వెంటనే ఆ కాల్ కట్ చేశారు. తనను రాజకీయంగా ఇబ్బందులు పాలు చేయడంలో భాగంగా ప్రత్యర్థులు తనపై హనీ ట్రాప్ కు సిద్దపడ్డారా..లేకపోతే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన పనా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో సదరు నేత ఈ వీడియో కాల్ ఉదంతంపై నేషనల్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ తో పాటు TGDCBలో  ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. అయితే సదరు నేత ఎవరనేది తెలియాల్సి ఉంది. అధికార పార్టీకి చెందిన నేతనా.. లేకపోతే బీఆర్ఎస్, బీజేపీకి నేతనా అనే ఆరా తీస్తున్నారు.

మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఉదంతాలు పెను దుమారమే రేపుతున్నాయి. ఏది ఏమైనా ప్రజా ప్రతినిధులు  పనికి మాలిన పనులు కాకుండా.. ప్రజలకు పనికొచ్చే పనులు చేస్తే బాగుంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link