Puri Ratna Bhandar: మళ్లీ తెరుచుకున్న పూరీ రత్న భండార్.. వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు ఇవే..

Thu, 18 Jul 2024-1:54 pm,

ఒడిశాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం పూరీ జగన్నాథుడి రత్న భండార్‌ని ఆదివారం జున్ 14 న తెలిచారు. దీనికోసం 11 మంది సభ్యులు ప్రత్యేకంగా జగన్నాథుడికి పూజలు నిర్వహించి మరీ రహస్య గదిని తెరిచారు. అక్కడ మూడు ఛాంబర్ లు ఉంటాయి. మొదటి ఛాంబర్ లో స్వామివారికి ప్రతి రోజు అలంకారం కోసం ఉపయోగించే ఆభరణాలను భద్రపరుస్తారు.

రెండో ఛాంబర్ లో కేవలం పండగ సమయంలో ఉపయోగించే ఆభరణాలు, కిరిటీల,బంగారం, వెండి ఆభరణాలు ఉంటాయని తెలుస్తోంది. మూడో గది అత్యంత రహస్యంగా ఉంటుంది. దీనిలో ఏముందే అనేదానిపైన ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. జులై 14 న మూడో ఛాంబర్ లో ఉన్న పెట్టేలను దూరం నుంచి అధికారులు తెరిచారు. కానీ అప్పటికే సమయం మించి పోవడం, చీకటి కావడంతో అధికారులు గదిని క్లోజ్ చేసేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజున (జులై 18)న మరోసారి గది తలుపులు తెరిచారు.

ఆదివారం రత్నభాండాగారం తలుపులు తెరిచినప్పుడు మొదటి, రెండో ఛాంబర్ లోని విలువైన వస్తువను, తాత్కలిక స్ట్రాంగ్ రూమ్ లోని అధికారులు తరలించినట్లు తెలుస్తోంది. దీన్నంతటిని అధికారులు వీడియో కూడా తీసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. పూరీ గదుల్లో ఇప్పటి వరకు లిస్టులో లేని చిన్న విగ్రహాలు, పంచలోహ విగ్రహాలు లభ్యమైనట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో.. ఆ విగ్రహాలన్నింటిని అధికారులు సీక్రెట్ స్ట్రాంగ్ రూమ్ లోకి తరలించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరోసారి ఈరోజు పూరీ ఆలయం తెరుచుకున్నాయి.  ఈ క్రమంలో ఈరోజు ఉదయం 9:51 గంటలకు తెరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే అధికారులు ఈరోజు పూరీకి భక్తులు దర్శనాన్ని నిలిపివేశారు.  సంప్రదాయ దుస్తులు ధరించిన వ్యక్తులను మాత్రమే ట్రెజరీలోకి అనుమతిస్తున్నామని పూరీ కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వైన్ తెలిపారు. 

ఈ క్రమంలో.. వస్తువుల తరలింపు ఇవాళ పూర్తి కాకపోతే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) ప్రకారం పని కొనసాగుతుంది. మొత్తం ప్రక్రియను వీడియో తీస్తునట్లు స్వైన్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా..  46 ఏళ్ల తర్వాత పూరీ జగన్నాథ స్వామి ఆలయ రత్న భాండాగారాన్ని ఆదివారం మధ్యాహ్నం 1.28 గంటలకు తెరిచారు. 1978 లో రహస్య గదిని చివరిసారిగా ఓపెన్ చేశారు. ఆ తర్వాత మరల పూరీ గదిని ఇప్పుడు తెరిచారు.  దీంతో ఇది దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దీనిలో అత్యంత అరుదైన మణిమాణిక్యాలు, బంగారం, వజ్రాలు ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది.

ఒడిశాలో.. ఎన్నికల సమయంలో పూరీ జగన్నాథుడి ఆలయం తెరవడంపై రాజకీయ రంగు పులుముకుంది. ఇదిలా ఉండగా.. ఎన్నికల్లో గెలిస్తే తప్పకుండా పూరీ రహస్య  గదిని తెరిపిస్తామని బీజేపీ హమీ ఇచ్చింది. అదే విధంగా పూరీ ప్రజలు కూడా బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించిన విషయం తెలిసిందే. నవీన్ పట్నాయక్ ప్రభుత్వం పూరీ రహస్య గది తెరవడంతో పూర్తిగా విఫలమైందని కూడా బీజేపీ విమర్శించింది. పూరీలో ఆలయం కింద మరో గది ఉన్నట్లు కూడా మరో ప్రచారం జరిగింది. 

గతంలో పూరీ రహస్య గదిలోని సంపద లెక్కించేందుకు 70 రోజుల సమయం పట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మాత్రం అప్ డెటేడ్ టెక్నాలజీ, సాంకేతికత, మెన్ పవర్ కూడా అధికంగా ఉన్న నేపథ్యంలో తక్కువ సమయంలోనే జగన్నాథుడి సంపదను లెక్కించవచ్చని అధికారులు అంటున్నారు. జులై 14 న పూరీ రహస్య గదిని ఓపెన్ చేయగానే స్థానిక ఎస్సీ సొమ్మసిల్లి పడిపోయారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశ ప్రజలతో పాటు, పూరీలో కూడా రహస్యగది సంపద విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link