Ola Electric 3-wheeler: ఓలా నుంచి కొత్త ఆటో.. సేమ్ కారు లాగే ఉంది!
మార్కెట్‌లో ఇప్పటికీ బజాజ్ ఇతర కంపెనీలకు సంబంధించిన ఆటోలనే చూసి ఉన్నాం. కానీ అతి త్వరలోనే ఓలా నుంచి కూడా కొత్త ఆటో విడుదల కాబోతోంది. ఇది ఎలక్ట్రిక్ వేరియంట్‌లో అందుబాటులోకి రానుంది.
త్వరలో రాబోయే Ola 3-వీలర్ శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్‌తో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఈ ఆటో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రీమియం బ్యాటరీ సెటప్‌తో విడుదల కానుంది.
ఈ ఆటో బ్యాటరీ అద్భుతమైన కెపాసిటీతో విడుదల కానుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటుంది. అలాగే నగరాల్లో కూడా అద్భుతమైన మైలేజీని అందించేందుకు కొన్ని ప్రత్యేకమైన ఫీచర్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వస్తోంది.
ఓలా 3-వీలర్‌లో అనేక రకాల కొత్త ఫీచర్స్ లభిస్తాయి. ఇందులో GPS నావిగేషన్‌తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్స్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్ ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి.
ఈ త్రీ విల్లర్‌లో క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా దీని డిజైన్ చాలా ఆకర్శనీయంగా కనిపిస్తుంది. అంతేకాకుండా కాంపాక్ట్ సైజ్‌లో ఇది విడుదల కాబోతోంది.
ఇక ఈ త్రీ విల్లర్‌కు సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. ఓలా కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ అతి త్వరలోనే వెళ్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీని బ్యాటరీ 8 సంవత్సరాల వారింటీని కలిగి ఉంటుంది.