Old Vehicles Seizing: ఆ నెంబర్ సిరీస్ వాహనం కనిపిస్తే చాలు సీజ్.. ఇప్పటికే 800 వాహనాలు సీజ్
Old Vehicles Seizing: కొత్తగా వచ్చిన వెహికిల్ స్క్రాపేజ్ పాలసీలో భాగంగానే తాజాగా నొయిడా పోలీసులు కాలుష్యానికి కారణం అవుతున్న పాత వాహనాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ వద్ద ఉన్న గణాంకాల ప్రకారం UPZ సిరీస్ నెంబర్ వాహనాలకు కాలం చెల్లింది.
Old Vehicles Seizing: ఈ నెంబర్‌తో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు వెహికిల్ స్క్రాప్ కిందకు వచ్చేశాయి. దీంతో నొయిడా, గ్రేటర్ నొయిడా పోలీసులు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగిన వాహనాలపై దృష్టిసారించారు. ఉత్తర్ ప్రదేశ్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ వద్ద ఉన్న గణాంకాల ప్రకారం యూపీజడ్ నెంబర్‌తో 1,19,612 వాహనాలు రిజిస్టర్ అయ్యాయి.
Old Vehicles Seizing: ఇప్పటికే రెండు నెలల క్రితమే యూపీజడ్ సిరీస్ నెంబర్ కలిగిన వాహనదారులకు తమ వాహనాలను స్క్రాప్ చేస్తూ అప్పగించాల్సిందిగా నోటీసులు జారీచేసింది. అయితే, వాహనదారుల నుంచి స్పందన కరువు అవడంతో ప్రస్తుతం ఆ వాహనాలను వెతికి పట్టుకునే పనిని నొయిడా పోలీసులకు అప్పగించారు. దీంతో 6 బృందాలుగా తయారైన పోలీసులు.. కాలుష్య కారకాలుగా మారిన పాత వాహనాలను ట్రేస్ చేసే పనిలో పడ్డారు.
Old Vehicles Seizing: అందులో భాగంగానే ఇప్పటికే 800 వాహనాలు సీజ్ చేశారు. అందులో 367 కార్లు ఉండగా మిగతావి రకరకాల వాహనాలు ఉన్నాయి. దీంతో కొత్త పాలసీ ప్రకారం కాలం చెల్లిన పాత వాహనాలు కలిగిన యజమానులు తమ వాహనాలను వదులుకోవాల్సి వస్తుందే అని ఆందోళన చెందుతున్నారు.
Old Vehicles Seizing: ఒకవేళ ఈ పాత వాహనాలకు ఎన్ఓసి లభించినట్టయితే.. అవి వేరే రాష్ట్రాల్లో రోడ్లపై తిరిగేందుకు అనుమతిస్తారు. ఏదేమైనా.. ఇండియాలో 20 ఏళ్లకు మించి ఏ కారు కూడా రోడ్డెక్కడానికి వీల్లేదు అనే విషయం మర్చిపోవద్దు.
ఇది కూడా చదవండి : Car Insurance Tips: కారు ఇన్సూరెన్స్ చేయిస్తున్నారా ?
ఇది కూడా చదవండి : Worlds Most Costly Resort: ప్రపంచంలోనే ఖరీదైన రిసార్ట్.. ఒక్కరాత్రికి రూ. 1 కోటికిపైగా చార్జ్
ఇది కూడా చదవండి : Home Loan EMIs: ఈ బ్యాంకులో హోమ్ లోన్ తీసుకున్న వారికి బ్యాడ్ న్యూస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
యాపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook