Oppo Reno 13 Series: భారత టెక్‌ మార్కెట్‌లో ప్రభంజనం.. దిమ్మతిరిగి ఫీచర్స్‌తో Reno 13 Series మొబైల్‌.. ఫీచర్స్‌ లీక్‌!

Sat, 04 Jan 2025-10:44 pm,

త్వరలోనే Oppo నుంచి మార్కెట్‌లోకి Reno 13 5G సిరీస్ అందుబాటులోకి రాబోతోంది. దీనిని త్వరలోనే భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ రెండు వేరియంట్స్‌లో విడుదల చేబయతోంది. ఇవి Oppo Reno 13తో పాటు  Reno 13 Pro పేర్లతో విడుదల కానున్నాయి. ఈ మొబైల్స్‌కి సంబంధించిన విడుదల తేదిని కూడా కంపెనీ ప్రకటించింది.  

ఇక ఈ Oppo Reno 13 స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఇది మోస్ట్‌ పవర్‌ఫుల్‌ 5,600mAh బ్యాటరీతో విడుదల కాబోతోంది. అంతేకాకుండా ప్రీమియం లుక్‌లో కనిపించేందుకు ప్రత్యేకమైన కలర్‌ ఆప్షన్స్‌లో విడుదల కాబోతోంది.  దీనిని కంపెనీ  జనవరి 9న భారత్‌లో విడుదల చేయబోతోంది.   

ఈ Oppo Reno 13 స్మార్ట్‌ఫోన్‌ను మొదటగా ప్రముఖ ఈ కామర్స్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఈ మొబైల్‌ రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో (8GB RAM + 128GB, 256GB) విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్స్‌ను  ఐవరీ వైట్‌, లుమినస్ బ్లూ కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది.   

ఇక Oppo Reno 13 Pro 5G స్మార్ట్‌ఫోన్ సంబంధించిన స్టోరేజ్‌ వివరాల్లోకి వెళితే.. ఇది (12GB ర్యామ్‌ + 256GB, 512GB) స్టోరేజ్ ఆప్షన్‌లో విడుదల కాబోతోంది. ఇది కూడా వివిధ కలర్‌ ఆప్షన్స్‌లో రాబోతోంది.  

Oppo Reno 13 5G సిరీస్ ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఈ సిరీస్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 SoC చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో రన్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రత్యేకమై కొన్ని AI ఫీచర్స్‌ కూడా లభిస్తాయి. అలాగే ప్రత్యేకమైన IP68, IP69 రేటింగ్‌ సపోర్ట్‌తో విడుదల కానుంది.   

ఈ Oppo Reno 13 Pro 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన బ్యాక్‌ సెటప్‌ వివరాల్లోకి వెళితే.. ఇది  50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో ప్రధాన కెమెరాతో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ఈ కెమెరా 3.5x ఆప్టికల్ జూమ్‌ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే  5,800mAh బ్యాటరీ సపోర్ట్‌తో వస్తోంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link