Owl Sacrifice: దీపావళిరోజు అక్కడి వాళ్లు గుడ్ల గూబల్ని బలిస్తారు.. దీని వెనకున్న ఈ రహస్యం మీకు తెలుసా..?
ప్రస్తుతం దేశంలో దీపావళి సందడి నెలకొంది. అయితే... దీపావళి రోజున కొన్ని చోట్ల ఇప్పటికి కూడా వెరైటీ సంప్రదాయాలను పాటిస్తుంటారు.
దీపావళిని ఐదురోజుల పాటు పండగలా జరుపుకుంటారు. ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి,భాయ్ దుజ్ వరకు కూడా ఐదు రోజుల పాటు దీపావళిని పండుగలా జరుపుకుంటారు. అంటే అక్టోబరు 29 నుంచి నవంబర్ 2 వరకు దీపావళిని జరుపుకుంటారు.
ఈ పండుగ రోజున కొన్ని చోట్ల దీపావళి రోజున స్పెషల్ గా లక్ష్మి పూజలు చేస్తుంటారు. మరికొన్నిచోట్ల రాత్రి పూట అమావాస్య రోజున పూజలు చేస్తుంటారు. అయితే.. దీవాళి రోజున ఉత్తరాదిన కొన్నిరాష్ట్రాల వారు వెరైటీ సంప్రదాయాల్ని పాటిస్తారు.
సాధారణంగా గుడ్లగూబను లక్ష్మి దేవీకి వాహానంగా చెప్తుంటారు. అయితే.. దీపావళి నేపథ్యంలో ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాలలో.. గుడ్లగూబల్ని వేటాడుంటారు.అంతే కాకుండా.. దీపావళి అమావాస్య రోజున రాత్రిపూట వాటిని బలిస్తుంటారు
ఇలా గుడ్లగూబలను బలి ఇవ్వడం వల్ల ఏడాది పాటు సంపదలకు లోటు ఉండని అక్కడి వాళ్లు నమ్ముతుంటారు. అందుకు ఈ విధంగా గుడ్లగూబల్ని బలిస్తారంట.
అంతే కాకుండా.. అక్కడ సంతలో దీవాలి వస్తుందంటే.. చాలు గుడ్లగుబల్ని పట్టుకుని అమ్ముతుంటారు. వాటి పరిమాణంను బట్టి ధరను నిర్ణయిస్తారు. ఇప్పటికి కూడా కొన్ని చోట్ల ఈ సంప్రదాయంను పాటిస్తు వస్తున్నారు.