Pawan Kalyan Vs Mahesh Babu: మహేష్ బాబు ఆ రికార్డును బ్రేక్ చేయలేకపోయిన పవన్ కళ్యాణ్..

Fri, 20 Sep 2024-8:00 am,

గత కొంత కాలంగా తెలుగులో రీ రిలీజ్ ల ట్రెండ్  నడస్తోంది. ఓల్డ్ బ్లాక్ బస్టర్ చిత్రాలను 4K లో విడుదల చేస్తున్నారు. రీసెంట్ గా  మహేష్ బాబు బర్త్ డే సందర్బంగా రీ రిలీజైన ‘మురారి’ మూవీ  రీ రిలీజైన చిత్రాల్లో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. తాజాగా మురారి ఫస్ట్ డే రికార్డును పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజైన గబ్బర్ సింగ్ బ్రేక్ చేసింది.  కానీ ఓవరాల్ కలెక్షన్స్ విషయంలో మురారి రికార్డు ను గబ్బర్ సింగ్ బ్రేక్ చేయలేకపోయింది.

మురారి.. మహేష్ బాబు హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రీ రిలీజ్ లో ఫస్ట్ డే  రూ.5.41 కోట్ల గ్రాస్ వసూళ్లతో మొదటి స్థానంలో ఉండే. తాజాగా గబ్బర్ సింగ్ రాకతో ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఈ చిత్రం  రీ రిలీజ్ లో మొత్తంగా రూ. 8.90 కోట్ల గ్రాస్ వసూళ్లతో టాప్ ప్లేస్ ఉంది.

గబ్బర్ సింగ్..

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజైన ‘గబ్బర్ సింగ్’ చిత్రం టాలీవుడ్ లో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఫస్ట్ డే రూ. 7.01 కోట్ల  గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ప్రీమియర్స్ కలిపితే.. రూ. 7.53 కోట్ల గ్రాస్ వసూల్లతో తెలుగులో రీ రిలీజ్ లో ఫస్ట్ డే హైయ్యోస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. రీ రిలీజ్ లో ఓవరాల్ గా రూ. 8.01 కోట్ల గ్రాస్ వసూళ్లతో తెలుగులో టాప్ 2లో నిలిచింది.

ఖుషీ ఎస్.జె.సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా భూమిక హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఖుషీ’. రీ రిలీజ్ లో ఫస్ట్ డే ఈ సినిమా రూ. 4.15 కోట్ల గ్రాస్ వసూళ్లతో టాప్ 4లో నిలిచింది. ఓవరాల్ గా రూ. 7.46 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో టాప్ 3లో ఉంది.

బిజినెస్ మ్యాన్.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా  నటించిన బిజినెస్ మ్యాన్’. ఈ సినిమా రీ రిలీజ్ లో మొదటి రోజు  రూ.5.27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఓవరాల్ గా రూ. 5.85 కలెక్సన్స్ తో రీ రిలీజ్ టాప్ కలెక్షన్స్ లో టాప్ 4లో నిలిచింది.

సింహాద్రి.. రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా  తెరకెక్కిన చిత్రం ‘సింహాద్రి’. ఈ మూవీ రీ రిలీజ్ లో ఫస్ట్ డే రూ. 4.01 కోట్ల గ్రాస్ వసూళ్లతో టాప్ 5లో నిలిచింది. ఓవరాల్ గా మొత్తం వసూళ్ల విషయానికొస్తే.. రూ. 4.60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో టాప్ 5లో నిలిచింది. 

ఈ నగరానికి ఏమైంది.. తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో  తెరకెక్కిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’. ఈ సినిమా రీ రిలీజ్ లో మొదటి రోజు రూ. 81 లక్షల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది ఈ సినిమా రీ రిలీజ్ లో రూ.3.52 కోట్ల గ్రాస్ వసూళ్లతో టాప్ 6లో నిలిచింది.

మొత్తంగా తెలుగులో రీ రిలీజ్ లో ట్రెండ్ తగ్గినట్టు కనిపించినా.. మురారితో మళ్లీ రీ రిలీజ్ లకు ఊపు వచ్చింది. తాజాగా పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ పీక్స్ చేరిందనే చెప్పాలి.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link