Petrol: అరే వా.. బావిలో నీళ్లకు బదులుగా పైకి వస్తున్న పెట్రోల్.. ఎగబడుతున్న జనాలు.. ఎక్కడో తెలుసా..?
ప్రస్తుతం పెట్రోల్, డీజీల్ ధరలు జనాలకు చుక్కల్ని చూపిస్తున్నాయి. ఎక్కడ చూసిన కూడా సామాన్యుడు తన బండిని బైటకు తీద్దామంటే వందసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా మంది బస్సులు, మెట్రోల్లో జర్నీలు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఛత్తీస్ గఢ్ లోని దంతేవాడలో ఒక బావి నుంచి పెట్రోల్ పైకి ఉబికి వచ్చింది. దీంతో అక్కడున్న వారు.. వెంటనే బకెట్ లలో పోటీపడ్డారు. అది కాస్త ఆ ఏరియాలో ఉన్నవాళ్ల కు కూడా తెలిసిపోయింది.
వెంటనే చుట్టుపక్కల వారు సైతం.. తమకు కూడా ఫుకట్ పెట్రోల్ కావాలని పోటీకి దిగారు. దీంతో అక్కడ గొడవ చోటు చేసుకుంది.దీంతో వీరి రచ్చ పీఎస్ వరకు వెళ్లింది. అప్పుడు బావిలో పెట్రోల్ ఘటన బైటపడింది.
పోలీసులు రంగంలోకి దిగి.. అసలు బావిలో నుంచి పెట్రోల్ ఎలా వస్తుందనే దానిపై ఆరా తీశారు. ఇక్కడే బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ బావి ఉన్న చోటికి 100 మీటర్ల దూరంలో ఒక పెట్రోల్ బంక్ ఉంది. దానిపై పైప్ లైన్ కాస్త లీక్ అయ్యిందంట. దాన్నుంచి పెట్రోల్ ఈ బావిలొకి భారీగా వచ్చి చేరుతుంది.
దీంతోనే బావిలో పెట్రోల్ ఉబికి వస్తుందని పోలీసులు గుర్తించారు. దీంతో అక్కడ ఎలాంటి ప్రమాదం జరక్కుండా ఫైర్ సిబ్బందిని మోహారించారు. అంతే కాకుండా.. పెట్రోల్ పంప్ లీకేజీ పనులు చేస్తున్నట్లు తెలుస్తొంది.
ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఫ్రీగా పెట్రోల్ వస్తుందని చాలా మంది ఈ బావి దగ్గరకు వచ్చి మరీ పెట్రోల్ ను తీసుకెళ్లారంట. అంతే కాకుండా.. ఈ విషయం చాలా రోజుల నుంచి ఎవరికి తెలియ నీయకుండా కూడా మెయింటెన్ చేశారంట. ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.