Mukesh Ambani: అపర కుబేరుడు ముఖేష్ అంబానీ వాడుతున్నఫోన్ ధర తెలిస్తే..ఆశ్చర్యపోతారు..!!
Nita Ambani Phone : ఆసియాలో అత్యంత సంపన్నుడు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గురించి తెలుసుకునేందుకు నెటిజెన్లు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సాధారణంగా అంబానీ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఏ పని చేసినా.. వారి గురించి తెలుసుకోవడం సహజంగా మారింది. ఎందుకంటే సంపన్న కుటుంబాలకు చెందిన వ్యక్తుల జీవనశైలి పైన ప్రతి ఒక్కరు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
ప్రస్తుతం ముఖేష్ అంబానీ వాడే ఫోన్ గురించి ఇప్పుడు నెట్టింట పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.ఇటీవల ఆయన కుమారుడు అనంత అంబానీ వివాహం సందర్భంగా దేశవ్యాప్తంగా చేసిన హడావిడి అందరికీ తెలిసిందే. డబ్బులు మంచినీళ్ళలా ఖర్చుపెట్టి కోట్లాది రూపాయలతో ఈ వివాహాన్ని అంగరంగ వైభవంగా చేశారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక దిగజాలతో సహా సెలబ్రిటీలంతా క్యూ కట్టారు. దీన్నిబట్టి ముఖేష్ అంబానీ పవర్ ఏంటో యావత్ ప్రపంచానికి తెలిసి వచ్చింది.
అంతటి పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ముఖేష్ అంబానీ ఏ ఫోన్ వాడుతాడో తెలిస్తే అందరూ ఆశ్చర్య పోవాల్సిందే. ముఖేష్ అంబానీ ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఫోన్ వాడుతున్నారని ఇటీవల కొన్ని వార్తా కథనాలు తెలిపాయి. ముకేశ్ అంబానీ గతంలో అయోధ్య రామ మందిరం ప్రతిష్టాపన సందర్భంగా తన ఫోన్ తో దేవాలయాన్ని ఫోటోలు తీస్తూ కనిపించారు. అప్పుడు ఆయన ఫోన్ మీద ప్రపంచం దృష్టి పడింది. అప్పుడే ఆయన ఏ ఫోను వాడుతున్నారన్న సంగతి బాహ్య ప్రపంచానికి తెలిసి వచ్చింది.
ముఖేష్ అంబానీ వాడుతున్న ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఫోన్ ఖరీదు రూ. 1,50,000 ఇందులో వన్ టీవీ స్టోరేజ్ ఉంటుంది. ఇందులో అత్యాధునికమైన మంచి క్లారిటీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ తో ఫోటోలు తీసినట్లైతే చాలా ఫుల్ క్లారిటీతో కనిపిస్తాయి.ఇక అంబానీ సతీమణి నీతా అంబానీ సైతం ఇదే ఫోన్ వాడటం విశేషం.
ఇదిలా ఉంటే నిజానికి సాధారణ మధ్యతరగతి వారికి లక్షన్నర పెట్టి ఫోన్ కొనాలంటే మామూలు విషయం కాదు.కానీ అంబానీ లాంటి సంపన్నుడికి లక్షన్నర అంటే చాలా తక్కువ మొత్తం చెప్పవచ్చు.మరి ఈ అపరకుబేరుడు సంపాదిస్తున్న సంపాదనను బట్టీ చూస్తే, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫోన్ కొనుగోలు చేసే సామర్థ్యం ఆయనకు ఉంది.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫోన్ లలో Falcon Supernova iPhone Pink Diamond అనే కష్టమైజ్డ్ ఫోన్ వజ్రాలను పొదిగి ఉంటుంది. దీని ఖరీదు 400 కోట్ల రూపాయలు..కానీ ముఖేష్ అంబానీ మాత్రం కేవలం రూ. 1.50 లక్షల ఫోన్ వాడటం విశేషం అని నెటిజెన్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.