Boy Flying in The air with a Kite: గాలిపటంతో 30 అడుగుల వరకు ఎగిరిన బాలుడు.. ఆ తర్వాత ఏమైంది!
Boy Flying in the air with a Kite: గాలిపటాలు ఎగరవేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుంటాయి. ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. 12 ఏళ్ల బాలుడు ఒక పెద్ద డ్రాగన్ గాలిపటంతో సహా గాలిలోకి 30 అడుగుల వరకు ఎగిరిపోయాడు, అదే ఎత్తు నుంచి నేరుగా కిందపడిపోయాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇండోనేషియాలోని లంపంగ్‌కు చెందిన ప్రింగ్‌సేవు రీజెన్సీ ఏరియాలో ఓ పాఠశాలలో గాలిపటం ఎగురుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. డ్రాగన్ గాలిపటం ఎగురవేయగా.. దాన్ని పట్టుకున్న 12 ఏళ్ల బాలుడు సైతం గాలిపటంతో గాలిలోకి ఎగిరిపోయాడు.
ఎంతలా ఆ విద్యార్థి ఎగరాడంటే.. ఏకంగా 30 అడుగుల వరకు డ్రాగన్ గాలిపటంతో పాటు గాల్లో ఎగిరాడు. అనంతరం నేలమీద పడిపోవడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. రెండు చేతులకు ఆరు చోట్ల ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది. అయితే బాలుడు ప్రాణాలతో బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. అక్కడే ఉన్న కొందరు ఈ సంఘటనను కెమెరాలో బంధించి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారాయి.
ఆ బాలుడికి రెండు సర్జరీలు చేయగా ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. బాలుడి సోదరుడు మాట్లాడుతూ.. డ్రాగన్ గాలిపటం ఎగురవేసే సమయంలో భారీ గాలులు వీచాయి. ఆ సమయంలో తన సోదరుడు పట్టుకోవడంతో గాలిపటంతో గాల్లోకి ఎగిరాడని చెప్పాడు.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో యోగాకార్తాలోని బంటుల్ రీజెన్సీలో 14 ఏళ్ల బాలుడు గాలిపటంతో గాలిలో సుమారు 11 అడుగుల దూరం ఎగిరాడు. అనంతరం తీగకు చిక్కుకుని గాయపడ్డాడు.
Photos: Niharika Konidela Wedding Photos: నటి నిహారిక వివాహ వేడుక ఫొటో గ్యాలరీ
ఈ ఏడాది ఆగస్టులో సైతం తైవాన్‌లో ఇలాంటి ప్రమాదం జరిగింది. మూడేళ్ల బాలిక గాలిపటంతో ఏకంగా 100 అడుగుల ఎత్తు వరకు వెళ్లింది. అయితే ఆ ఈవెంట్‌కు హాజరైనవారు ఎలాగోలా కష్టపడి ఆ చిన్నారిని రక్షించడంతో ప్రాణాపాయం తప్పింది.
Also Read : WhatsApp Features: మీ వాట్సాప్‌లో మెస్సెజ్‌లు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయా.. ఇలా చేస్తే సరి!