Piles Cure: పైల్స్ రోగులు డ్రై ఫ్రూట్స్ తినవచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..
పైల్స్ ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోతున్న సమస్య. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా సరైన జీవనశైలి పాటించకపోవడం దీనికి ప్రధాన కారణం. అయితే, పైల్స్ తో బాధపడుతున్నవారు డ్రైఫ్రూట్స్ తినవచ్చా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
పైల్స్ ముఖ్యంగా గర్భందాల్చడం, మద్యపానం, ధూమపానం, టాయిలెట్‌లో ఎక్కవ సమయంపాటు కూర్చోవడం వల్ల పైల్స్ వస్తాయి. అయితే, ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తారు.అయితే ఈ పైల్స్‌తో బాధపడేవారు డ్రైఫ్రూట్స్ తినవచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారు అంటే..
కొన్ని రకాల డ్రైఫ్రూట్స్ తింటే పైల్స్ సమస్య ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా కొన్ని రకాల డ్రైఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలి. పైల్స్ లక్షణాలు తగ్గించే డ్రైఫ్రూట్స్ ఏంటో తెలుసుకుందాం.
రాత్రి నానబెట్టిన బాదంలను పైల్స్‌తో బాధపడేవారు తీసుకోవచ్చు. పైల్స్‌తో బాధపడేవారు ప్రతిరోజు రాత్రి నానబెట్టిన బాదంలను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. వీటివల్ల మీకు పైల్స్ సమస్య తగ్గుముఖం పడుతుంది. రోజూ ఓ 7 బాదం పప్పుల వరకు తీసుకోవచ్చు.
వాల్నట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివి. ప్రతిరోజూ రాత్రి నానబెట్టిన వాల్నట్స్ తీసుకోవడ వల్ల పైల్స్ సమస్య తగ్గుతుంది. రోజూ రెండు వాల్నట్స్ తీసుకుంటే గుండెకు కూడా మంచిది. పైల్స్ వ్యాధిగ్రస్థులు వీటిని డైట్లో చేర్చుకోవాలి.
అంతేకాదు పైల్స్ వ్యాధి ఉన్నవారు అత్తిపండ్లు తినవచ్చు. ముఖ్యంగా ఇవి ఎంతో ఆరోగ్యకరం మనకు సులభంగా అందుబాటులో ఉంటాయి. పైల్స్ సమస్యతో బాధపడుతున్నవారు తమ డైట్లో అత్తిపండ్లను చేర్చుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)