Sarva pitru Amavasya 2024: సర్వపితృ అమావాస్య ఎప్పుడు..?.. ప్రాముఖ్యత.. శ్రాద్ధం చేయాల్సిన ఖచ్చితమైన సమయం..
మన పూర్వీకులు ప్రతి ఏడాది.. పితృపక్షాలలో భూమి మీదకు వస్తారని చెబుతుంటారు. అందుకు ఈ కాలంలో మనవాళ్ల కోసం చేసేశ్రాధ్ద కర్మాదులు వాళ్లు స్వీకరిస్తారంట. ఆతర్వాత మన వంశాన్ని ఆశీర్వదిస్తారు.అదే విధంగా ఈ సమయంలో మనం ఏంచేసిన కూడా అది పూర్వీకులకు చెందుతుందని భావిస్తారు.
పదిహేనురోజుల పాటు.. చనిపోయిన మన పూర్వీకుల పేరు మీదుగా ఏదో ఒక తిథి రోజున శ్రాధ్దాధికాలు చేయాలి. దీని వల్ల ఎంతో పుణ్యం వస్తుంది. మన వాళ్లకు అన్నం పెట్టిన వాళ్లమౌతాం. అంతేకాకుండా.. మనవాళ్లు కూడా చాలా సంతోషిస్తారు. కొంత మంది శ్రాధ్దధికాలు చనిపోయిన మన పూర్వీకుల తిథుల పేరు మీదుగా జరిపిస్తారు.
కొంత మంది పూర్వీకులు ఏ రోజున చనిపోయారో తెలియదు. అంతేకాకుండా.. ఈ పితృపక్షాలలో కొంత మంది ఏదో ఒక అడ్డంకుల వల్ల వారి పూర్వీకుల మరణించిన తిథులలో శ్రాద్ధం చేయలేకపోతారు. అలాంటి వారు పితృపక్షాలలో చివరి రోజైన సర్వ పితృఅమావాస్య రోజున చేసే కర్మలు చేస్తారు. ఇది రెట్టింపు ఫలితాలను ఇస్తుంది.
ప్రతి ఏడాది సర్వ పితృఅమావాస్య రోజుల చాలా మంది ప్రత్యేకంగా శ్రాధ్దధికాలు నిర్వహిస్తారు. మెయిన్ గా.. ఈ ఏడాది 1 వ తేదీనా.. లేదా 2వ తేదీనా అని చాలా మంది కన్ ఫ్యూజ్ అవుతున్నారు. సర్వ పితృఅమావాస్య.. సెప్టెంబర్ 1వ తేదీన రాత్రి ప్రారంభమౌతుంది. మరల సెప్టెంబర్ 2వ తేదీన మధ్యాహ్నాం 1 వరకు ఉంది.ఉదయం కాలం, శ్రాద్దకాలంలో అమావాస్య ఉంది. అందుకే సర్వ పితృ అమావాస్యను సెప్టెంబర్ 2న జరుపుకొవాలి.
ఎవరైతే ఈరోజు పోయిన వాళ్లకు శ్రాధ్దకర్మలు చేయిస్తారో.. వారికి మంచి జరుగుతుందని చెబుంటారు. ఎలాంటి పితృ సంబంధ శాపాలు కూడా దూరమౌతాయి. అంతేకాకుండా.. జీవితంలో కలిగే సమస్యల నుంచి పూర్వీకులు బైటపడేస్తారని చెబుతుంటారు. అంతేకాకుండా.. గతించిన వారికి కూడా స్వర్గలోకాలు దొరుకుతాయని చెబుతుంటారు.
సర్వ పితృ అమావాస్య రోజున రావి చెట్టుకు ప్రత్యేకంగా పూజలు చేయాలి. దీని మీద పితృదేవతను ఉంటారని చెబుతుంటారు. అదే విధంగా కాకులు, నల్ల కుక్కలు, ఆవులకు కూడా మంచి ఆహారం పెట్టాలి. ఎవరి దగ్గర కూడా.. ఈ రోజున మనం చేసే ఏ పని అయిన అది రెట్టింపుమంచి ఫలితాలను ఇస్తుంది. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)