Pitru Dosh: ఈ సంకేతాలు మీ ఇంట్లో ఈ కన్పిస్తున్నాయా..?. అయితే పితృదోషం ఉన్నట్లే.. పండితులు ఏమంటున్నారంటే..?
అనంత చతుర్థశి మరుసటిరోజు నుంచి పితృపక్షాలు మొదలౌతాయి. పితృపక్షాలు అంటే.. పదిహేనురోజులు అన్నమాట . ఈరోజుల్లో మనచనిపోయిన పూర్వీకులు తిరిగి భూమ్మీదకు వస్తారని చెప్తుంటారు. వీరి వంశంలోని పిల్లలు.. శ్రాద్ధకర్మాది కార్యక్రమాలు నిర్వహించి పిండప్రదానం నిర్వహిస్తారు.
ఇలా పిండప్రదానం తర్పణం స్వీకరించిన తర్వాత పితృదేవతలు తిరిగి తమ లోకాలకు వెళ్లిపోతుంటారు. కొంత మంది పితృపక్షాలలో.. తమ వంశంవారు.. ఒక్కసారైన తమకోసం అన్నదానాలు దానం చేస్తారా.. అంటూ ఎదురు చూస్తారంట. ఒక వేళ శ్రాద్ధకర్మాదులు చేయ్యకపోతే మాత్రం శపిస్తారంట.
ముఖ్యంగా పూర్వీకలు శాపం ఉన్న వారి కుటుంబంలో కొన్నిసంకేతాలు కన్పిస్తుంటాయి. నిరంతరం గొడవలు జరుగుతుంటాయి. అంతేకాకుండా.. ఇంట్లో మెండల్ పీస్ ఉండదు. ఎంత కష్టపడిన కూడా గుర్తింపు ఉండదు. డబ్బు అస్సలు నిలవదు.
కొంత మందికి ఎంత ప్రయత్నించిన కూడా పెళ్లికుదరదు. ఒకవేళ పెళ్లి జరిగిన కూడా సంసార జీవితంలో అంతగా హ్యాపీనెస్ ఉండదు. మరోవైపు..నిరంతరం ఫ్యామిలీలో ఏవో గొడవలు ఉంటాయి. ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి.
మరికొందరిలో పెళ్లి జరిగిన కూడా సంతానం ఉండదు. సంతానం విషయంలో లేని పోనీ ఇబ్బందులు ఎదుర్కొంటు ఉంటారు. భవిష్యత్తు ఏంతో అర్థంకాక ఆగమ్య గోచరంగా కాలం గడుపుతుంటారు. తండ్రితో ఎల్లప్పులు గొడవలు ఉంటాయి.
పెళ్లైన తర్వాత పిల్లలు పుట్టరు. ఒక వేళ పుట్టిన కూడా వైకల్యంతో పుడతారు. ఇలాంటి సంకేతాలు ఉంటే మాత్రం.. పితృపక్షాలలో తప్పకుండా పూర్వీకుల కోసం శ్రాద్ధకర్మాదికాలు చేయించాలి. తమ పూర్వీకుల తృప్తి కోసం.. పండితులు సూచనల మేరకు శ్రాద్దకర్మలు, దాన, ధర్మాలు మిస్ కాకుండా చేయాలి. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)