PM Kisan: పీఎం కిసాన్ ఏడాదికి రూ.6,000.. కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం..!
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PMKSN) పై కేంద్ర ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. ప్రతి ఏడాది రూ.6000 రైతులకు నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా జమా చేస్తోంది.
ఏడాదిలో మూడు విడుతల్లో రూ.2,000 చొప్పున మొత్తంగా రూ.6,000 జమా చేస్తోంది. ఇది చిన్నా సన్నకారు రైతులకు ఆర్థికంగా చేయూత అందిస్తోంది.
ఈ పథకం కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరి నుంచి ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకంలో చేరాలంటే ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు లేదా లోకల్ పట్వారీ, రెవెన్యూ ఆఫీసర్‌ను కలిసి రిజిస్టర్ చేసుకోవచ్చు.
పీఎం కిసాన్ పోర్టల్ pmkisan.gov.in ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. మీ స్టేటస్ చెక్ చేసుకునే సౌలభ్యం కూడా కల్పించారు. అంతేకాదు మీరు కేవైసీ కచ్చితంగా పూర్తి చేస్తేనే ఈ పథకానికి అర్హులు అవుతారు.
దీనికి మీ భూమి పత్రాలు, బ్యాంక్ ఖాతా, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కలిగి ఉండాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మీ ఆధార్, బ్యాంకు ఖాతాకు లింక్ అయి ఉండాలి.
అయితే, ఇప్పటి వరకు 18 విడుతలు పీఎం కిసాన్ డబ్బులను రైతుల ఖాతాల్లో జమా చేశారు. అక్టోబర్ 5 ఈ ఏడాది డబ్బులు రైతుల ఖాతాల్లో నేరుగా జమా చేశారు.
19వ విడుత పీఎం కిసాన్ డబ్బుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ విడుత డబ్బులను 2025 ఫిబ్రవరి నెలలో విడుదల చేయనున్నారు. ఈలోగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. కేవైసీ పూర్తి చేసుకోవాలి.
ఇదలా ఉండగా పీఎం కిసాన్ ప్రతి ఏడాది రూ.6000 కౌలు రైతులకు అందించే ప్రతిపాదన ఇప్పడు ఏం లేదు అని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు 18 విడుతల్లో రూ.3.46 లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో జమా చేశామని చెప్పారు.
ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు, ట్యాక్స్ కట్టేవారు ఈ పథకం ద్వారా లబ్ది పొందితే వారి నుంచి కూడా రికవరీ చేస్తున్నాయని కేంద్ర మంత్రి ప్రకటించారు.