PM Modi: మీ తాటకు చప్పుళ్లకు భయపడం.. కెనడాలో ఆలయం దాడి ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ..
కెనడాలో ఇటీవల ఖలీస్థానీలు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా భారత్ దేశం టార్గెట్ గా చేసుకుని జాతీయ జెండాను అగౌరవ పరుస్తున్నారు. అంతేకాకుండా.. ప్రధాని మోదీ, అమిత్ షా దిష్టిబొమ్మలను సైతం దహానం చేశారు.
ఇదిలా ఉండగా.. కొన్నిరోజులుగా కెనడాలో హిందుదేవాలయాలు, భారతీయులే టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయి. తాజాగా, బ్రాంప్టన్ లోని హిందు దేవాలయంపై దాడి ఘటన పెనుసంచలనంగా మారింది.
బ్రాంప్టన్ లో హిందు దేవాలయంలో ఉన్న హిందువులపై ఖలీస్తానీయులు దాడులకు పాల్పడినట్లు తెలుస్తొంది. దీంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. పొలీసులు రంగంలోకి దిగి పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ ఘటనను భారత కాన్సులేట్ తో పాటు, కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడోసైతం ఖండించారు. అయితే.. తాజాగా, ఈ ఘటనపై భారత దేశ ప్రధాని మోదీ స్పందించారు. ఇవన్ని పిరికి పందల చర్యలుగా అభివర్ణించారు.
ఇలాంటి చర్యలతో తమ ఆత్మస్థైర్యం దెబ్బతీయలేరన్నారు. ఉద్దేష పూర్వకంగా చేసిన ఈ దాడుల్ని ఖండిస్తున్నామన్నారు. దీనిపై వెంటనే కెనడా ప్రభుత్వం చర్యలు తీసుకొవాలని, దుండగులపై కెనడాలో చట్టం, న్యాయవ్యవస్థలు కఠినంగా వ్యవహరించాలని ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ ట్విట్ చేశారు..